Telangana: పాలనపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్.. ఇకపై అక్కడి నుంచే సమీక్షలు, సమావేశాలు ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక నుండి రోజు స‌చివాల‌యానికి రాన్నున్నారు. గత రెండు నెల‌లుగా ఎన్నిక‌ల కోడ్ నేపథ్యంలో స‌చివాల‌యానికి దూరంగా ఉన్నారు సీఎం రేవంత్. మార్చి 16 నుండి జూన్ 6 వ‌ర‌కు ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంది. దీంతో సీఎం ప‌రిపాల‌నాప‌ర‌మైన అంశాల‌కు దూరంగా ఉన్నారు. స‌మీక్ష‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌డానికి, అధికారుల‌ను క‌ల‌వ‌డానికి అనుమ‌తి లేక‌పోవ‌డంతో సీఎం త‌న నివాసం జూబ్లీహిల్స్ నుండే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారాల‌ను కూడ అక్క‌డి నుండే నిర్వ‌హించారు సీఎం రేవంత్.

Telangana: పాలనపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్.. ఇకపై అక్కడి నుంచే సమీక్షలు, సమావేశాలు ..
Cm Revanth Reddy
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 07, 2024 | 9:18 AM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక నుండి రోజు స‌చివాల‌యానికి రాన్నున్నారు. గత రెండు నెల‌లుగా ఎన్నిక‌ల కోడ్ నేపథ్యంలో స‌చివాల‌యానికి దూరంగా ఉన్నారు సీఎం రేవంత్. మార్చి 16 నుండి జూన్ 6 వ‌ర‌కు ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంది. దీంతో సీఎం ప‌రిపాల‌నాప‌ర‌మైన అంశాల‌కు దూరంగా ఉన్నారు. స‌మీక్ష‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌డానికి, అధికారుల‌ను క‌ల‌వ‌డానికి అనుమ‌తి లేక‌పోవ‌డంతో సీఎం త‌న నివాసం జూబ్లీహిల్స్ నుండే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారాల‌ను కూడ అక్క‌డి నుండే నిర్వ‌హించారు సీఎం రేవంత్. అత్య‌వ‌స‌ర స‌మావేశాలు, సమీక్ష‌లు ఉంటే కూడా అధికారుల‌కు పలు సూచనలు ఇచ్చారు త‌ప్ప అదేశించడానికి వీలు లేకుండా పోయింది.

అత్య‌వ‌స‌ర స‌మీక్ష‌ల కోసం స‌చివాల‌యానికి..

స‌చివాల‌యానికి వ‌చ్చిన తరువాత కొన్ని అత్య‌వ‌స‌రాల‌కు సంబంధించిన అంశాల‌పై సీఎం సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటుగా, విత్త‌నాల కోర‌త, వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు సంబంధించిన వాటిపై అధికారుల‌తో స‌మీక్షించారు. దీనితో పాటు ప‌లు ముఖ్యశాఖ‌ల‌పై కూడా అధికారుల‌తో చర్చలు జరిపారు. అప్పుడు కోడ్ అందుబాటులో ఉండ‌టంతో పూర్తి స్థాయిలో సమీక్షించ‌డానికి నిబంధన‌లు అడ్డువచ్చాయి.

కోడ్‎లోనే కేబినేట్ స‌మావేశానికి నిర్ణ‌యం..

ఇక కోడ్ కొన‌సాగుతుండ‌గానే కేబినేట్ స‌మావేశం నిర్వ‌హించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది. కానీ అందుకు ఎన్నిక‌ల సంఘం ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చింది. కేబినేట్ స‌మావేశం కోసం నిర్ణ‌యించిన మే 18 రోజున ఈసీ నుండి సమాధానం రాలేదు. దీంతో స‌మావేశం కోసం రాత్రి వ‌ర‌కు మంత్రులు, అధికారులు వేచి చూసారు. దీంతో సీఎం కేబినేట్ పర్మిష‌న్ రాక‌పోవ‌డంతో వాయిదా వేశారు. మ‌ళ్లి ఈసి ప‌ర్మిషన్ రావ‌డంతోనే మే 21 న నిర్వ‌హించుకున్నారు. ఆ స‌మావేశంలో తెలంగాణ అవ‌త‌ర‌ణ ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దాని కోసం ఈసీ అనుమ‌తి కోరి ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు.

ఇవి కూడా చదవండి

నేటి నుండి స‌చివాల‌యానికి సీఎం..

ఇక కోడ్ ముగిసిన నేఫ‌థ్యంలో జూన్ 7 నుంచి య‌ధావిధిగా స‌చివాల‌యంలో విధులకు హ‌జరుకావాల‌ని నిర్ణ‌యించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేప‌టి నుండి పెండింగ్‎లో ఉన్న అంశాల‌పై దృష్టి సారించాల‌ని భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గర్భిణిని కత్తితో పొడిచిన సీరియల్‌ నటుడు.! గర్భ విచ్ఛిత్తి
గర్భిణిని కత్తితో పొడిచిన సీరియల్‌ నటుడు.! గర్భ విచ్ఛిత్తి
ఐటీఆర్ ఫైల్ చేసినా రీఫండ్ రాలేదా..? తనిఖీ చేయండిలా..!
ఐటీఆర్ ఫైల్ చేసినా రీఫండ్ రాలేదా..? తనిఖీ చేయండిలా..!
సెప్టెంబరు 5 నాటికి డీఎస్సీ నియామక పత్రాలు అందజేత
సెప్టెంబరు 5 నాటికి డీఎస్సీ నియామక పత్రాలు అందజేత
నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన అవికా గోర్ దెయ్యం సినిమా
నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన అవికా గోర్ దెయ్యం సినిమా
జాలరి పంట పండింది.. వలలో చిక్కిన బంగారు చేప.!
జాలరి పంట పండింది.. వలలో చిక్కిన బంగారు చేప.!
మద్యం ప్రియులకు చేదు వార్త.. 2 రోజులు షాపులు బంద్
మద్యం ప్రియులకు చేదు వార్త.. 2 రోజులు షాపులు బంద్
ఆడబిడ్డల కోసం అద్భుతమైన స్కీమ్.. పెళ్లి నాటికి రూ. 22.5లక్షలు
ఆడబిడ్డల కోసం అద్భుతమైన స్కీమ్.. పెళ్లి నాటికి రూ. 22.5లక్షలు
వర్షాకాలంలో వాటర్‌ట్యాంక్‌ నుంచి చేపల వాసన వస్తోందా..? ఈ చిట్కాలు
వర్షాకాలంలో వాటర్‌ట్యాంక్‌ నుంచి చేపల వాసన వస్తోందా..? ఈ చిట్కాలు
సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? ఒక్కొక్కటి దివ్యాస్త్రమే..
సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? ఒక్కొక్కటి దివ్యాస్త్రమే..
బెల్లీఫ్యాట్‌ని తగ్గించే అద్భుతమైన డ్రింక్‌. రోజూ పరగడుపున తాగాలి
బెల్లీఫ్యాట్‌ని తగ్గించే అద్భుతమైన డ్రింక్‌. రోజూ పరగడుపున తాగాలి