Telangana: మూడవస్థానానికే పరిమితం.. సెంటిమెంట్ కరీంనగర్‌లో బీఅర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్..!

కరీంనగర్ భారత రాష్ట్ర సమితికి కంచుకోట. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ప్రతి‌ ఎన్నికల్లో సత్తా చాటింది. అంతే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు‌ బీఅర్ఎస్ మధ్య సెంటిమెంట్‌ సంబంధం ఉంది. ఇక్కడ నెగ్గితే తెలంగాణ అంతా పాజిటివ్ ఫలితాలు వస్తాయనే నమ్మకం. కానీ 2019 ఎన్నికల‌ నుండి బీఅర్ఎస్ కంచుకోటకు బీటలు వారుతున్నాయి.

Telangana: మూడవస్థానానికే పరిమితం.. సెంటిమెంట్ కరీంనగర్‌లో బీఅర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్..!
Brs
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Jun 06, 2024 | 6:01 PM

కరీంనగర్ భారత రాష్ట్ర సమితికి కంచుకోట. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ప్రతి‌ ఎన్నికల్లో సత్తా చాటింది. అంతే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు‌ బీఅర్ఎస్ మధ్య సెంటిమెంట్‌ సంబంధం ఉంది. ఇక్కడ నెగ్గితే తెలంగాణ అంతా పాజిటివ్ ఫలితాలు వస్తాయనే నమ్మకం. కానీ 2019 ఎన్నికల‌ నుండి బీఅర్ఎస్ కంచుకోటకు బీటలు వారుతున్నాయి. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఏకంగా మూడవ స్థానానికే పరిమితం అయ్యింది.

ఒకప్పడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను బీఅర్ఎస్ పార్టీతో వేరుగా చూడలేని పరిస్థితి. ఆ పార్టీ ఆవిర్భావం ‌‌నుండి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ సత్తా చాటింది. గతంలో‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ‌కరీంనగర్ జిల్లాలో‌ అనుకూల ఫలితాలు సాధించింది. తెలంగాణ ‌ఉద్యమ సమయంలో జరిగిన ఉప ఎన్నికలలో గులాబీ ‌జెండా రెపరెపలాడింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన‌ రెండు‌ అసెంబ్లీ ‌ఎన్నికలలో‌ క్లీన్‌స్వీప్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలలో తొంభై ఐదు శాతానికి పైగా‌ ఫలితాలు‌ సాధించింది.

ఈ‌ జిల్లాలో బీఅర్ఎస్‌‌కు తిరుగు లేదన్న సమయంలో‌ 2019. ఎన్నికలలో బీఅర్ఎస్ పార్టీకి మొదటి షాక్ తగిలింది. తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికలలో అనుకూలమైనా ఫలితాలు సాధించలేక పోయింది. కనీసం ఎంపీ ఎన్నికల్లోనైనా గట్టి పోటి ఇస్తారను బీఅర్ఎస్ నేతలు బావించారు. ఈ ఎన్నికలతో పార్టీ బలోపేతం అవుతుందని అంచనాలు వేసుకున్నారు. పోటీ మాట ఏమో గానీ, మూడవ స్థానానికే పరిమితం అయ్యింది. లోక్‌సభ ఫలితాలు బీఅర్ఎస్ శ్రేణులను తీవ్ర నిరాశకి గురి చేసింది.

రాష్ట్రంలో ‌ఒకటో రెండో సీట్లు బీఅర్ఎస్ ‌గెలిస్తే, అది‌ కరీంనగర్‌లో గెలుస్తుందని గులాబీ నేతలు భావించారు. కానీ, అందుకు భిన్నంగా పూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఇక్కడ పార్టీ బలంగా ఉన్న కనీసం రెండవ స్థానంలో కూడా నిలబడలేకపోయింది. కరీంనగర్ పార్లమెంటు ‌పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా లీడ్ ఇవ్వలేక పోయింది. బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా లీడ్ ఇవ్వలేక పోయింది. ఇక్కడ మాత్రం రెండవ స్థానంలో నిలిచింది.

మరో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ ‌అసెంబ్లీలో కనీస ఓట్లు కూడా సాధించలేక పోయింది. మూడవ స్థానానికే పరిమితం అయ్యింది కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో. బీఅర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న హుజురాబాద్ లో ‌కూడా మూడవస్థానానికే పరిమితం అయ్యింది. ఒకప్పుడు క్యాడర్, లీడర్‌లతో బలంగా‌ ఉన్న బీఅర్ఎస్, ఇప్పుడు మూడవ స్థానానికే పరిమితం ‌కావడంతో క్యాడర్ ‌అంతా‌ అయోమయానికి గురి అవుతుంది. అయితే ఇది తాత్కాలిక‌ అపజయమే అని, స్థానిక ‌సంస్థల ఎన్నికలలో‌ సత్తా ఏమిటో‌ చూపిస్తామని బీఅర్ఎస్ నేతలు అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..