CM KCR: ముందస్తు ముచ్చటే లేదు.. బీజేపీతో ‘ఢీ’కొట్టే వ్యూహం ఇదేనా..?
CM KCR Strategy: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రత్యర్ధిని ముందే ఎన్నుకున్నారు.. రాష్ట్రంలో బీజేపీతో ఢీకొట్టే వ్యూహప్రతివ్యూహాలను ముందే రచించారు. అందుకే..
CM KCR Strategy: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రత్యర్ధిని ముందే ఎన్నుకున్నారు.. రాష్ట్రంలో బీజేపీతో ఢీకొట్టే వ్యూహప్రతివ్యూహాలను ముందే రచించారు. అందుకే.. టిఆర్‌ఎస్‌కు ప్రత్యర్ది బీజేపీయేనంటూ కేసీఆర్ చెప్పకనే చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళదామనుకుంటున్న తరుణంలో సీఎం కేసీఆర్.. బిజెపితో పోరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో బిజెపితో ప్రారంభే పోరు భవిష్యత్తు రాజకీయాలకు పునాది వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే యూపీఎ కన్నా హీనంగా ఎన్టీయే ఫేయిల్ అయిందంటూ విమర్శలు గుప్పించారు. జాతీ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని దేశంలో మరో కొత్త జాతీయ పార్టీ రావొచ్చని అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 5లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, 9 ఏళ్ల పాలనలో అభివృద్ది, నిరుద్యోగం రూపుమాపాల్సిన ప్రభుత్వం కాశ్మీర్ ఫైల్స్ పేరుతో ప్రజల్లో మతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కేసీఆర్ పేర్కొన్నారు.
పంజాబ్ తరహాలో తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ ముందుంచి.. దేశంలో రైతుకు రాజ్యంగ రక్షణ హక్కు కల్పించాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఈడీ ఐటిలకు భయపడే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఐటీ ఈడీల పేరుతో బెదిరిస్తూ బ్లాక్ మేయిల్ చేస్తే తెలంగాణ సాధించిన మేము భయపడబోమన్నారు. దేశంలో అద్భుతమైన రైతు ఉద్యమాలను నిర్మించడానికి టిఆర్‌ఎస్ సమాయత్తం అవుతోందని.. ఇక మోదీ ప్రభుత్వాన్ని నిద్రపోనియ్యమంటూ కేసీఆర్ తూటాలు పేల్చారు. అయితే.. ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లేదే లేదంటూ పేర్కొన్నారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా ముందస్తు ముచ్చట లేదంటూ సీఎం కేసీఆర్ స్పష్టంచేసి.. రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు.
Also Read: