CM KCR: దేశంలో బీజేపీ ప్రభావం తగ్గుతోంది.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

CM KCR on Central Government: వరి సేకరణపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రంగంలోకి దిగారు. పంజాబ్ తరహాలో ధాన్యం సేకరణ చేయాలని

CM KCR: దేశంలో బీజేపీ ప్రభావం తగ్గుతోంది.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 21, 2022 | 6:46 PM

CM KCR on Central Government: వరి సేకరణపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రంగంలోకి దిగారు. పంజాబ్ తరహాలో ధాన్యం సేకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వరిని కొనకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వన్ నేషన్ – వన్ రేషన్ పథకం మాదిరిగా ధాన్యం సేకరణలో కూడా దేశమంతటా ఒకే విధానం ఉండాలని సీఎం కేసీఆర్ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు 24, 25 తేదీలల్లో పంజాబ్ మాదిరిగా తెలంగాణలో కూడా ఉద్యమం చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రేపు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ఆహారశాఖ మంత్రిని కలిసి సమస్యల గురించి వివరిస్తారన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం, సీట్లు తగ్గాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం తగ్గుతుందని పేర్కొన్నారు. యూపీలో బీజేపీకి 50 సీట్లు ఎందుకు తగ్గాయో ఆలోచించాలన్నారు. ఉత్తరాఖండ్‌లో సీట్లు, ఓట్లు తగ్గాయని.. పంజాబ్‌లో బీజేపీ (BJP) ని తరిమికొట్టారంటూ పేర్కొన్నారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓట్ల కోసమే సినిమాను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఏం చేయడం లేదని అందరికీ తెలిసిపోయిందన్నారు.

యూపీలో బేజీపీ బలం తగ్గుతుందని గతంలోనే చెప్పానని.. గతంలో 312కు గాను 255 స్థానాలకు బీజేపీ పరిమితమైందిసీట్లు తగ్గడం దేనికి సంకేతమో ఆ పార్టీ ఆలోచించుకోవాలని సీఎం సూచించారు. బీజేపీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని.. ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురాలేదన్నారు. దేశం బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. యూపీఏ పాలన సరిగా లేదని ప్రజలు బీజేపీకి అధికారం ఇచ్చారని.. కానీ బీజేపీ మరింత అధ్వాన పాలన సాగిస్తోంద్నారు. ప్రభుత్వరంగ సంస్థలను తాబేదార్లకు చౌకగా కట్టబెడుతున్నారన్నారు. ఏ రంగంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలంటూ సూచించారు.

కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌ ఫైల్స్‌ నినాదాన్ని లేవనెత్తిందని విమర్శించారు. కశ్మీర్‌ పండిట్‌లు తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. కశ్మీర్‌ పండిట్‌లకు జరిగిన అన్యాయాన్ని ఓట్ల రూపంలో కొల్లగొట్టేందుకే కేంద్రం ప్రయత్నం చేస్తోంద్నారు. ప్రజలను విభజన చేసి విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో సెలవులు ఇచ్చి కశ్మీర్‌ ఫైల్స్‌ చూడాలని ఉద్యోగులకు చెబుతున్నారని ఇదేం పద్దతి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ప్రజలను ఉద్వేగాలకు గురిచేస్తున్నారంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆరు నూరైనా ముందుస్తు ఎన్నికలకు వెళ్లమంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గతంలోలా ముందస్తు ఎన్నికలకు వెళ్లమంటూ కేసీఆర్ ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ ఏడేళ్లుగా తనకు మంచి మిత్రుడంటూ పేర్కొన్నారు

Also Read:

CM KCR: పంజాబ్ తరహాలో రైతు ఉద్యమం.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

Telangana: తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ ఇదే.. వివరాలివే..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?