CM KCR: పంజాబ్ తరహాలో రైతు ఉద్యమం.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

CM KCR on Central Govt: పంజాబ్ తరహాలో తెలంగాణలో రైతు ఉద్యమానికి సీఎం కేసీఆర్ వ్యూహరచన చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఉద్యమించేందుకు పార్టీ శ్రేణులు

CM KCR: పంజాబ్ తరహాలో రైతు ఉద్యమం.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 21, 2022 | 4:40 PM

CM KCR on Central Govt: పంజాబ్ తరహాలో తెలంగాణలో రైతు ఉద్యమానికి సీఎం కేసీఆర్ వ్యూహరచన చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఉద్యమించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవ్వాలంటూ పిలుపునిచ్చారు. రైతుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమం చేయాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కార్యచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 24,25 తేదీల్లో ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వరితోపాటు ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు అండగా టీఆర్ఎస్ ఉద్యమిస్తుందన్నారు. పంజాబ్ తరహాలో తెలంగాణకు కూడా ఫుడ్ బిల్ తీసుకురావాలని.. ఈ మేరకు భారీ ఉద్యమం చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై అంశాలవారీగా పార్లమెంట్‌లో ఎంపీలు గళమెత్తాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు సోమవారం జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు.

కాశ్మీర్ ఫైల్స్ పై ఆగ్రహం.. 

ఈ సందర్బంగా సీఎం కేసీఆర్.. కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో సమస్యలు పక్క దారి పట్టించే విధంగా సినిమా విడుదల చేశారని మండిపడ్డారు. ఈ నెల 28 న యాదాద్రి ప్రారంభోత్సవానికి అందరు రావాలని సీఎం కోరారు. కాశ్మీర్లో హిందూ పండిట్లను చంపినప్పుడు బిజెపి ప్రభుత్వం అధికారంలో లేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. రైతుల సమస్యలు పక్కదారి పట్టించేందుకు ఈ సినిమాను తెరపైకి తెచ్చారన్నారు.

కాగా.. ఇప్పటివరకు 30 నియోజకవర్గాల్లో సర్వే పూర్తయిందని.. అందులో 29 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని తేలిందని సీఎం వెల్లడించారు. నెలాఖరుకు అన్ని నియోజక వర్గాల సర్వేలు వస్తాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అలజడికి భయపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఫోకస్ చేయాలని సూచించారు.

కాగా.. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ అనేక వ్యూహాలపై మాట్లాడారు. లంచ్ తర్వాత రెండో సెషన్ ప్రారంభమవుతుంది. ఈ సెషన్‌లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ తీసుకోబోతున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read:

Uttar Pradesh: బీజేపీకి ఓటు వేసిన ముస్లిం మహిళను ఇంటి నుంచి గెంటేసిన కుటుంబసభ్యులు.. భర్త ఏంచేశాడంటే?

Punjab: పంజాబ్‌ ఆప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఫిజిక్స్ ప్రొఫెసర్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కేజ్రీవాల్