Uttar Pradesh: బీజేపీకి ఓటు వేసిన ముస్లిం మహిళను ఇంటి నుంచి గెంటేసిన కుటుంబసభ్యులు.. భర్త ఏంచేశాడంటే?
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ ముస్లిం మహిళ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఇప్పుడు ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ ముస్లిం మహిళ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఇప్పుడు ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. విడాకులు ఇవ్వాలని తన భర్త కూడా బెదిరించాడని ఆ మహిళ ఆరోపించింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉజ్మా అనే మహిళకు 2021 సంవత్సరంలో ఎజాజ్‌నగర్ గౌంటియా నివాసి తస్లీమ్ అన్సారీతో వివాహం జరిగింది.ఆ తర్వాత తన భర్తతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఫిబ్రవరి 14న జరిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్విహించిన పోలింగ్‌కు ముందు తన భర్త మేనమామ టైబ్ తన ఇంటికి వచ్చి ఎస్పీ పార్టీకి ఓటు వేయాలని కోరినట్లు ఆమె తెలిపారు. ఉజ్మా చెప్పిన ప్రకారం, ఫిబ్రవరి 14 న ఓటు వేసిన తర్వాత ఆమె ఇంటికి చేరుకున్నప్పుడు, ఆమె మామ ఎవరికి ఓటేశావని ఆమెను అడిగాడు. ఆమె ఎవరికి ఓటు వేసింది? ట్రిపుల్ తలాక్, పేదలకు రేషన్ ఇవ్వడం వల్లే తాను బీజేపీకి ఓటు వేశానని ఉజ్మా సమాధానం ఇచ్చారు. ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆమెపై కోపోద్రిక్తులయ్యారు. దీంతో ఆమె భర్తకు ఫోన్ చేసి జరిగిన సంగతి వివరించింది. అయితే, భర్త కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి.. ఇంటి నుంచి గెంటివేశారని.. విడాకులు తీసుకుంటానని బెదిరించాడని ఆమె వాపోయింది.
మార్చి 11న తన కుటుంబసభ్యులు తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఉజ్మా తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విడాకులతో పాటు సోదరుడిని కూడా చంపేస్తానని భర్త బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉజ్మా సమాచారం మేరకు కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.