Telangana: తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ ఇదే.. వివరాలివే..
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు...
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయని ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా, వాస్తవానికి ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోగా.. జేఈఈ పరీక్షలు వాయిదా పడటంతో తెలంగాణ ఇంటర్ పరీక్షలు మే 6వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు జరగనున్నాయి.