AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ నేతల తీరు మారలేదు..

రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి వచ్చింది. మనం అందరం కలిసి మెలిసి ఉండి పార్టీకోసం పనిచేయాలి. ఎక్కడ కూడా గొడవలు జరగవద్దు. గతం వేరు.. ఇప్పుడు వేరు. ఇవి కాంగ్రెస్ అధిష్టానం పదే పదే చెబుతున్న మాటలు. కానీ ఆ నియోజకవర్గ నేతలు మాత్రం ఈ మాటలను పెడచెవిన పెడుతున్నారట. పైన ఉన్న లీడర్ల్ మస్తు మాట్లాడుతారు.. కానీ కింద అలా ఉండదు అని అంటున్నారు లోకల్ నాయకులు.

Telangana: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ నేతల తీరు మారలేదు..
Dubbaka Congress Leaders
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Feb 25, 2024 | 9:11 PM

Share

రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి వచ్చింది. మనం అందరం కలిసి మెలిసి ఉండి పార్టీకోసం పనిచేయాలి. ఎక్కడ కూడా గొడవలు జరగవద్దు. గతం వేరు.. ఇప్పుడు వేరు. ఇవి కాంగ్రెస్ అధిష్టానం పదే పదే చెబుతున్న మాటలు. కానీ ఆ నియోజకవర్గ నేతలు మాత్రం ఈ మాటలను పెడచెవిన పెడుతున్నారట. పైన ఉన్న లీడర్ల్ మస్తు మాట్లాడుతారు.. కానీ కింద అలా ఉండదు అని అంటున్నారు లోకల్ నాయకులు. ఇంతంకీ ఆ నియోజకవర్గం ఏది అన్న ఆసక్తి మీలో ఉంటుంది. అదే దుబ్బాక. ఈ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితులు ఉన్నాయి. దివంగత నేత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఉన్నన్ని రోజులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా అంత ఇంత కాదు. ఇప్పటికీ ఈ నియోజకవర్గ పరిధిలో ఇంకా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే డై హార్ట్ కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, ఇక్కడ ఉన్న నేతల మధ్య మాత్రం పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. సరే మొన్నటి వరకు అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి నేతలు. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం గతంలో మాదిరిగానే ఉంది. దివంగత నేత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కొడుకు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో నేత శ్రవణ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరి నేతలకు అసలు పడడం లేదని టాక్ వినిపిస్తోంది. వీళ్ళకే కాదు వీళ్ళ అనుచరులకు కూడా ఈ మధ్య అసలు పడడంలేదట.

చెరుకు శ్రీనివాస్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. శ్రవణ్ కుమార్ రెడ్డి మెదక్ ఎంపీగా పోటీ చేశారు. ప్రతిసారి టికెట్ల విషయంలో వీరి ఇద్దరి మధ్య గొడవలు జరిగేవాట. కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గ పరిధిలో ఏదైనా కార్యక్రమం చేయాలని పిలుపిస్తే ఇద్దరు కలిసి కాకుండా వేరు వేరుగా కార్యక్రమాలు చేసేవరట. గతంలోనే కాదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందంటున్నారు అక్కడి స్థానికులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఒంటెత్తు పోకడ చూపిస్తూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని శ్రవణ్ కుమార్ రెడ్డి వర్గం శ్రీనివాస్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనా పని మీద మంత్రుల వద్దకు వెళ్తే నియోజకవర్గ ఇంచార్జిని కలవండి అని చెబుతున్నారట. కానీ ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఇంచార్జి మమ్మల్ని పట్టించుకోవడం లేదని చాలా సీరియస్‎గా ఉన్నారు. తాజాగా ఈ విషయంలోనే రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కూడా చెరుకు శ్రీనివాస్ రెడ్డి సొంత మండలం అయిన తొగుట మండలంకే తరలి వెళ్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదని శ్రవణ్ కుమార్ రెడ్డి వర్గం పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు.

గతంలో కూడా శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి వర్గాలు గొడవలు పడి అవి పోలీస్ కేసుల వరకు వెళ్లిన రోజులు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొంత పట్టు ఉన్న నియోజకవర్గం ఏది అంటే అది దుబ్బాక నియోజకవర్గం అని చెప్పాలి. ఒక వైపు ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీకి పట్టు ఉన్న అన్ని నియోజకవర్గలపై ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ ఎక్కువ ఓట్లు రావాలని ప్రణాళికలు రచిస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. కానీ దుబ్బాక కాంగ్రెస్ పార్టీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పార్టీకోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నా కూడా వారిని సరైన దారిలో నడిపే నాయకులు లేరు. ఉన్న ఇద్దరు నేతలు ఎంత సేపు వాళ్లలో వాళ్ళు కొట్టుకోవడానికే సరిపోతుందని నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు కొందరు పార్టీ నేతలు. ఓ వైపు అన్ని ఎంపీ స్థానాల్లో గెలుస్తాము అని చెబుతున్న కాంగ్రెస్ అధిష్టానం.. దుబ్బాక పై ఇప్పటికైనా సీరియస్ గా దృష్టి పెట్టాలంటున్నారు కార్యకర్తలు. ఈ వర్గపోరును ఆపి ఇక్కడ కార్యకర్తలు కాపాడుకోవల్సిన అవసరం ఉందని.. లేదంటే ఇక్కడ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతోంది అని సూచిస్తున్నారు. ఇలాగే వదిలివేస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్