AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddapalli BJP: బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ.. కసరత్తు చేస్తున్న బీజేపీ అధిష్టానం

పెద్దపల్లి పార్లమెంట్ స్థాననికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వేటలో పడింది పార్టీ హైకమాండ్. ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు దృష్టి సారించింది. ఇద్దరు, ముగ్గురు నేతలు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాదిగ సామాజికవర్గ నేతకు టికెట్ఇవ్వడానికి అధిష్టానం మొగ్గు చూపుతుందట.

Peddapalli BJP: బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ.. కసరత్తు చేస్తున్న బీజేపీ అధిష్టానం
Telangana BJP
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 25, 2024 | 8:30 PM

Share

పెద్దపల్లి పార్లమెంట్ స్థాననికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వేటలో పడింది పార్టీ హైకమాండ్. ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు దృష్టి సారించింది. ఇద్దరు, ముగ్గురు నేతలు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాదిగ సామాజికవర్గ నేతకు టికెట్ఇవ్వడానికి అధిష్టానం మొగ్గు చూపుతుందట.

పెద్దపల్లి పార్లమెంట్ స్థానం లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ సారి తెలంగాణలో అధిక స్థానాలు గేలిచేందుకు ప్రత్యేక వ్యుహ రచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గంలో మాత్రం గట్టి నేత లేకపోవడంతో ఏమి చేయాలో నేతలు ఆలోచిస్తున్నారట. ఇప్పటివరకు ఉన్న వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేయడంతో బలమైన నేత కరువయ్యాడు. ఇక్కడి నుంచి వివేక్ బరిలో ఉండే అవకాశం ఉండటం తో.. ఇతర నేతలపై దృష్టి పెట్టలేదట పార్టీ అధిష్టానం. అయితే.. అసెంబ్లీ ఎన్నికల ముందు.. వివేక్ బీజేపీ వీడి.. కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఒక్కసారి రాజకీయ పరిణామాలు మారిపోయాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన కుమార్ మరోసారి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా.. మాజీ ఎమ్మెల్యే కాసిపేట్ లింగయ్య టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట.

ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో మాదిగ సామాజిక వర్గంతోపాటు మాదిగ ఉప కులాలు ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. మాదిగ సామాజిక వర్గం నేతలపై దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ పార్టీలో బలమైన నేతలతో పాటుచ కాంగ్రెస్ లో ఉన్న బలమైన నేతలు చేర్పించుకునేందుకు దృష్టి పెడుతున్నారు. ఇప్పటికి ఇద్దరు, ముగ్గురు నేతలు బీజేపీ టచ్‌లోకి వెళ్లారట.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో మోదీ హావా, రామ మందిర్ నిర్మాణం అంశాలు విజయానికి దోహద పడుతాయని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సింగరేణి ఓట్లు కూడా కీలకం. ఈ ఓట్లను రాబట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో బలమైన నేతలు ఉన్నారు. ఈ రెండు పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. అయితే, ఈ రెండు పార్టీలో టికెట్ రాని నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉంది. బీజేపీ మొదటి జాబితాలో పెద్దపల్లి పేరు ఉండదని నేతలు చెబుతున్నారు.

ఎలాగైనా ఈసారి పెద్దపల్లిలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు పార్టీ అగ్రనేతలు. మొత్తానికి పెద్దపల్లిలో బీజేపీ వర్గ విభేదాలు కూడా తలనొప్పిగా మారిపోయాయి. బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎన్నిక నేపథ్యంలో రచ్చ రాజుకుంది. ఇక్కడ అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం తలనొప్పిగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేతలు సహకరించుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఇక్కడ పెరిగిన ఓటు బ్యాంక్ కారణంగా గట్టి పోటీ ఇవ్వడానికి బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..