తెలంగాణలో పెరిగిన విద్యుత్ వాడకం.. గతేడాదితో పోలిస్తే ఎంత పెరిగిందంటే..
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సమ్మర్ మొదలు కాకముందే భానుడి ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. దీంతో ప్రజలు సమ్మర్లో ఉపయోగించే కులర్, ఏసి, ఫ్రిడ్జ్ ల వాడకాన్ని బాగా పెంచేశారు. ఎంతగా అంటే గత సంవత్సరం ఫిబ్రవరి పూర్తి అయ్యే సరికి ఉన్న డిమాండ్ కంటే ఎక్కువగా వినియోగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరెంట్ డిమాండ్ పెరిగింది. సమ్మర్ వినియోగం తో పాటు రెగ్యులర్‌గా ఉపయోగించే పవర్ కూడా ఎక్కువగా వాడేస్తున్నారు.

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సమ్మర్ మొదలు కాకముందే భానుడి ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. దీంతో ప్రజలు సమ్మర్లో ఉపయోగించే కులర్, ఏసి, ఫ్రిడ్జ్ ల వాడకాన్ని బాగా పెంచేశారు. ఎంతగా అంటే గత సంవత్సరం ఫిబ్రవరి పూర్తి అయ్యే సరికి ఉన్న డిమాండ్ కంటే ఎక్కువగా వినియోగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరెంట్ డిమాండ్ పెరిగింది. సమ్మర్ వినియోగం తో పాటు రెగ్యులర్‌గా ఉపయోగించే పవర్ కూడా ఎక్కువగా వాడేస్తున్నారు. వీటిని విద్యుత్ సంస్థల అధికారులు తాజాగా వెల్లడించారు. పెరిగిన విద్యుత్ వినియోగాన్ని అధికారిక లెక్కల్లో చూపిస్తున్నారు.
లాస్ట్ ఇయర్ ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో పవర్ డిమాండ్ చాలా ఎక్కువగా నమోదయిందని అధికారులు చెప్పారు. పోయిన ఏడాది ఫిబ్రవరి లో 14 వేల మెగా వాట్స్లకు పైగా విద్యుత్ వినియోగిస్తే.. ఈ సంవత్సరం ఇంకా ఫిబ్రవరి పూర్తి కాకముందే 15 వేల మెగావాట్లకి పైగా విద్యుత్ వినియోగం పెరిగినట్లు చెబుతున్నారు. అంటే ఈ నెల పూర్తి కావడానికి మరో నాలుగు రోజుల సమయం ఉంది. ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలలో ఇప్పటి వరకు సగటున కరెంట్ వినియోగం 256.74 మిలియన్ యూనిట్లకు చేరిందంటున్నారు. అయితే గతేడాది మాత్రం 242.95 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగంలోకి వచ్చినట్లు చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే పవర్ డిమాండ్ ఈసారి చాలా ఎక్కువగా పెరిగింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో 2,930 మెగా వాట్ల డిమాండ్ రికార్డ్ కాగా.. ఈ సంవత్సరం మాత్రం 3,174 మెగావాట్లుగా రికార్డ్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం మీద సగటు విద్యుత్ వినియోగం 57.34 మిలియన్ యూనిట్లుగా నమోదు అయ్యింది. కానీ గత ఏడాది మాత్రం గ్రేటర్ హైదరాబాద్ సగటు విద్యుత్ వినియోగం 51.69 యూనిట్లుగా రికార్డుల్లో ఉంది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే పవర్ వినియోగం ఏ మేరకు పెరిగిందో అర్థమవుతుంది. ఇక రానున్నది సమ్మర్.. భగభగ మండే ఎండలు.. దీంతో సేద తీరడానికి ఇంట్లో చల్లటి వాతావరణం కోసం ఏసి, కులార్ల వినియోగం పెరగనుంది. దీంతో మరింత కరెంట్ వినియోగం పెరగనుందని భావిస్తున్నారు. దీనికి తగినట్టుగా ఉత్పత్తిని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




