AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: లాస్య కుటుంబానికి కేటీఆర్ పరామర్శ.. అండగా ఉంటానని హామీ!

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రెండు రోజుల క్రితం ORRపై పటాన్‌ చెరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు అందుబాటులో లేని కేటీఆర్.. ఇవాళ ఆమె ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు.

KTR: లాస్య కుటుంబానికి కేటీఆర్ పరామర్శ.. అండగా ఉంటానని హామీ!
Ktr
Balu Jajala
|

Updated on: Feb 25, 2024 | 11:08 AM

Share

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రెండు రోజుల క్రితం ORRపై పటాన్‌ చెరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు అందుబాటులో లేని కేటీఆర్.. ఇవాళ ఆమె ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు. లాస్య రోడ్డు ప్రమాదం లో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యానని, ఆరోజు నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ అమ్మాయిని గత 10,15 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయని, గత ఏడాది  వారి నాన్న ఎమ్మెల్యే సాయన్న  చనిపోయారని, ఇప్పుడు ఈమె చనిపోవటం బాధాకరమని కేటీఆర్ అన్నారు. లాస్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, లాస్య నందితను కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలిపించారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వెంట మాజీ హోమ్ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అలా వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాల్ రాజ్, స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కేటీఆర్ రాక నేపథ్యంలో కంటోన్మెంట్ కు బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు భారీగా చేరుకున్నారు.

కాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అనుమానాస్పద మృతి నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర వీఐపీల డ్రైవర్లకు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల వీఐపీలకు సంబంధించిన ప్రమాదాలు, కొన్ని ప్రమాదాలు ప్రాణాంతకంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడం తాజా ఘటన. విఐపి కార్లు నడిపే డ్రైవర్లందరికీ రవాణా శాఖ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విఐపిలందరికీ సహకరించాలని కోరుతూ లేఖలు పంపుతామని ఆయన పేర్కొన్నారు.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ