AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాజకీయ సుడిగుండంలో ఆ రెండు ప్రతిష్టాత్మక సంస్థలు.. అస్త్రంగా మార్చుకుంటోన్న బీఆర్‌ఎస్‌, బీజేపీ.

తెలుగురాష్ట్రాలకే గర్వకారణంగా ఉన్న రెండు ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పుడు రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించడంతో దీనిని రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నాయి పార్టీలు. అటు తెలంగాణలోనూ ఇప్పటికే సింగరేణి గనుల వ్యవహారంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య యుద్ధం జరుగుతంది..

Telangana: రాజకీయ సుడిగుండంలో ఆ రెండు ప్రతిష్టాత్మక సంస్థలు.. అస్త్రంగా మార్చుకుంటోన్న బీఆర్‌ఎస్‌, బీజేపీ.
Singareni
Narender Vaitla
|

Updated on: Apr 20, 2023 | 9:41 PM

Share

తెలుగురాష్ట్రాలకే గర్వకారణంగా ఉన్న రెండు ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పుడు రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించడంతో దీనిని రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నాయి పార్టీలు. అటు తెలంగాణలోనూ ఇప్పటికే సింగరేణి గనుల వ్యవహారంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య యుద్ధం జరుగుతంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి అగ్గి రాజేశాయి. కాపాడుకోవాల్సిన సంస్థలపై రాజకీయాలు చేస్తూ పార్టీలు ఓట్ల వేట సాగిస్తున్నాయా? అన్న అనుమానాలు వస్తున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ బిడ్జింగ్‌ గడువు ముగిసిన విషయం తెలిసిందే. గత నెల 27న విడుదలైన ఈవోఐ మొత్తం 29 కంపెనీలు బిడ్‌లు దాఖలు చేశాయి. అందులో 7 విదేశీ సంస్థలు ఉన్నాయి.

బిడ్‌ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు తామే బిడ్ వేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు ప్రకటించారు. సింగరేణి సంస్థ ప్రతినిధులు వెళ్లి స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపారు. హడావిడి చేసి వెనకంజ వేయడంపై స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ఎందుకు వెనక్కి తగ్గిందో చెప్పాలంటోన్న కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అటు సింగరేణి బిడ్లలో పాల్గొనకుండా కేంద్ర ప్రభుత్వమే కుట్రలు చేస్తుందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు సింగరేణి కార్మికుల కష్టాన్ని విశాఖ స్టీల్‌లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి సంస్థలో కేసీఆర్‌ కుటుంబ జోక్యం పెరిగిందని.. అసలు సంస్థ ఆర్ధిక స్థితిగతులు, కార్మికులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు కేంద్రమంత్రి.

అటు స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో భ్రమలు కల్పించిన బీఆర్ఎస్‌.. ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు జీవీఎల్‌. సింగరేణి సంస్థను తెలంగాణ ప్రభుత్వం బలోపేతం చేయాలని చూస్తుంటే.. కేంద్రమే గనులు ఇవ్వకుండా బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. మొత్తానికి సింగరేణి టు విశాఖ స్టీల్‌ తెలుగు రాష్ట్రాల్లో రెండు చారిత్రాత్మక సంస్థల చుట్టూ రాజకీయం చేస్తున్నాయి పార్టీలు. సెంటిమెంట్ రాజేసి పార్టీలు ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయా.?

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో