Telangana: రాష్ట్ర మంత్రులకు ‘బోర్లాగ్’ అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయంలో సాధించిన పురోగతిని గమనించి ప్రత్యేకంగా బోర్లాగ్ సదస్సు ఆహ్వానం పలికింది. ఈ నెల 24 నుండి 26 వరకు అమెరికాలోని అయోవా రాష్ట్రం డెమోయిన్ నగరంలో సదస్సుకు మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రపంచ హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీద ప్రతి ఏటా జరుగుతున్న ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయంలో సాధించిన పురోగతిని గమనించి ప్రత్యేకంగా బోర్లాగ్ సదస్సు ఆహ్వానం పలికింది. ఈ నెల 24 నుండి 26 వరకు అమెరికాలోని అయోవా రాష్ట్రం డెమోయిన్ నగరంలో సదస్సుకు మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రపంచ హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీద ప్రతి ఏటా జరుగుతున్న ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యవసాయరంగంలో ఆహార భద్రతకు ఎదురయ్యే సవాళ్లపై ఈ సమావేశాల్లో చర్చలు జరుగుతాయి. అయితే ప్రపంచ దేశాల నుండి 1200 మంది ప్రతినిధులు ఈ సదస్సకు హాజరుకానున్నారు. అలాగే ఆన్ లైన్ మాధ్యమంలో కూడా వేలాది మంది భాగస్వాములు కానున్నారు. ఈనెల 22 నుండి 29 వరకు మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. అలాగే వీరితో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, తెలంగాణ సీడ్స్ ఎండీ డాక్టర్ కేశవులు బృందం వెళ్లనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..