Telangana: ఓట్లు మావే.. సీట్లు మావే.. ముదిరాజు ఆత్మగౌరవ సభలో ఈటల కీలక వ్యాఖ్యలు

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ముదిరాజ్ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ముదిరాజులు తరలివచ్చారు.ఈ సభకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా కులానికి సంబంధించిన ముఖ్యనాయకులందరూ మీటింగ్‌కి హాజరయ్యారు. ఈ నేపథ్యలో ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలకు చేశారు. జనాభా ప్రకారం ముదిరాజులకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అన్నారు.

Telangana: ఓట్లు మావే.. సీట్లు మావే.. ముదిరాజు ఆత్మగౌరవ సభలో ఈటల కీలక వ్యాఖ్యలు
Eetala Rajendar
Follow us

|

Updated on: Oct 08, 2023 | 7:57 PM

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ముదిరాజ్ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ముదిరాజులు తరలివచ్చారు.ఈ సభకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా కులానికి సంబంధించిన ముఖ్యనాయకులందరూ మీటింగ్‌కి హాజరయ్యారు. ఈ నేపథ్యలో ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలకు చేశారు. జనాభా ప్రకారం ముదిరాజులకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అన్నారు. బీసీలకు 9 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటే కేవలం మూడు పదవులు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో 11 శాతం ముదిరాజు సామాజిక వర్గం ఉంటే.. రాజకీయంగా ఏ పార్టీ కూడా ఆదరించలేదని అన్నారు. ముదిరాజులకు విద్య, ఉద్యోగ అవకాశాలు రావలంటే గతంలోనే బీసీ డీ నుంచి బీసీ ఏ కు వేయాలని ఆలోచన చేశామని పేర్కొన్నారు.

మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు శాసన సభలో ముదిరాజుల గురించి ప్రస్తావన తీసుకొచ్చానని ఈటల అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముదిరాజుల సమస్యలను అర్థం చేసుకొని వారి గురించి ఆలోచినస్తామని చెప్పినట్లు తెలిపారు. అలాగే 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముదిరాజులను ‘బీసీ డీ’ నుంచి ‘బీసీ ఏ’కు మార్చారని.. మైనార్టీలకు కూడా 4 శాతం రిజర్వేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఇవి కేవలం ఒక్క ఏడాది మాత్రమే అమలయ్యాయని ఆ తర్వాత ఆగిపోయాయని తెలిపారు. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.. వారి పక్షాన మైనార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో.. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషల్ అమలు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. కానీ ముదిరాజుల సమస్యను ఎవరూ కూడా పట్టించుకోలేదని.. ఇప్పటికీ ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. తెలంగాణ వచ్చాకా సీఎం కేసీఆర్ కూడా ఆ సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు. అలాగే దళిత ముఖ్యమంత్రి అని దళితులను మోసం చేశారని.. పదేళ్లుగా ఆదివాసీలకు ఒక్క మంత్రి పదవికూడా ఇవ్వలేదని అన్నారు. పథకాల కోసం అర్జీలతో సరిపెట్టుకోకుండా ఓట్లు మావే.. సీట్లు మావే అనే నినాదంతో పోరాడాలని ఈటల పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..