Vikarabad: పైకి చూస్తే నల్ల బెల్లం లోడ్.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్
ప్రభుత్వ అదేశాలతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలో ఎక్కడ కూడా నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణా లేకుండా చేయాలని దాడులు నిర్వహిస్తోంది. కాని కొందరు అక్రమార్కులు మాత్రం తండాలకు నల్ల బెల్లాన్ని తరలించి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు.
ప్రభుత్వ అదేశాలతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలో ఎక్కడ కూడా నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణా లేకుండా చేయాలని దాడులు నిర్వహిస్తోంది. కాని కొందరు అక్రమార్కులు మాత్రం తండాలకు నల్ల బెల్లాన్ని తరలించి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో నాటుసారా తయారీకి అవసరమైన బెల్లాన్ని కర్ణాటక ప్రాంతంలో కొనుగోలు చేసి వికారాబాద్ జిల్లా ఓమ్లానాయక్ తండాకు తరలిస్తు ఉండగా.. ఎక్సైజ్ డీటీఎప్ పోలీసులు పక్క సమాచారంతో కర్ణాటక నుంచి వికారాబాద్‌కు రవాణ అవుతున్న బెల్లం వ్యాన్‌ను పట్టుకున్నారు.
ఇది చదవండి: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని కుంచవరం అనే ప్రాంతం నుంచి ముగ్గురు వ్యక్తులు ఒక వ్యాన్‌లో 5180 కేజీల బెల్లాన్ని తరలిస్తున్న సమాచారంతో ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ భాస్కర్ గౌడ్, డిటిఎఫ్ ఎస్సై ప్రేమ్‌కుమార్ ఆకస్మిక తనిఖీలు చేసి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్రమంగా వ్యాన్‌లో తరలిస్తున్న నల్ల బెల్లాన్ని పెద్దాముల్ మండలం ఓమ్లానాయక్ తండా దగ్గర స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్‌లో పరిశీలించగా నాటుసారాకు వినియోగించే నల్లబెల్లం ఉంది. సంబంధిత బెల్లాన్ని స్వాధీనం చేసుకోని తూకం వేయగా 5180 కిలోలు ఉన్నట్టు తేలింది. బెల్లంతో పాటు నాటు సారా లిక్కర్‌ను కూడా పట్టుకున్నట్లు ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ భాస్కర్ తెలిపారు.
ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే
కర్ణాటకలో రూ. 40 కిలో చొప్పున కొనుగోలు చేసిన ఈ బెల్లాన్ని తండాల్లో రూ.60 నుంచి రూ. 100 వేరకు అమ్మకాలు జరుపుతారని సమాచారం. సుమారు బెల్లం విలువ రూ. 4.14 లక్షల మేర ఉంటుందని.. వ్యాన్ మరో రూ. 2 లక్షలు ఉంటుందాని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ కేసులో రాథోడ్ పాండు నాయక్, రాథోడ్, ఓం సింగ్, రాథోడ్ సచిన్‌లను రిమాండ్ చేశారు. గతంలో పాండ్ అనే వ్యక్తి ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు రికార్డులో ఉందని.. పాండుపై రూ. 2 లక్షల జరిమానా వేసే అవకాశాలు ఉంటాయని తెలిపారు.
ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..