Tollywood: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే

పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ మీకు గుర్తుందా.? అల్లరి నరేష్‌తో 'యాక్షన్ 3D' అనే సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో చేసినవి కేవలం నాలుగు సినిమాలు మాత్రమే. అయితే ఇందులో రెండు చిత్రాలు అస్సలు విడుదలకు నోచుకోలేదు. అందం, అభినయంతో..

Tollywood: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే
Actress
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 23, 2024 | 8:30 AM

పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ మీకు గుర్తుందా.? అల్లరి నరేష్‌తో ‘యాక్షన్ 3D’ అనే సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో చేసినవి కేవలం నాలుగు సినిమాలు మాత్రమే. అయితే ఇందులో రెండు చిత్రాలు అస్సలు విడుదలకు నోచుకోలేదు. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ అందాల భామ.. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామరస్ ఫోటోలతో కాకరేపుతోంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? లేదంటే మేమే ఒక క్లూ ఇస్తాం. పాన్ ఇండియా స్టార్ ప్రియాంక చోప్రా ఈమెకు వదిన అవుతుంది.

ఎస్.! మీరు అనుకుంటున్నది కరెక్టే.. ఆమె మరెవరో కాదు నీలమ్ ఉపాధ్యాయ. ముంబైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. మోడలింగ్ కెరీర్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశపెట్టింది. తెలుగులో ‘మిస్టర్ 7’ అనే మూవీతో అరంగేట్రం చేసింది. అనంతరం అల్లరి నరేష్ సరసన ‘యాక్షన్ 3D’ చిత్రాన్ని చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడగా.. హీరోయిన్‌గా నీలమ్ ఉపాధ్యాయకు మళ్లీ సరైన అవకాశాలు రాలేదు. తమిళంలో రెండు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో ‘యాక్షన్ 3D’ తర్వాత సుమారు ఐదేళ్లకు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. దీంతో అర్ధాంతరంగా నీలమ్ ఉపాధ్యాయ సినీ కెరీర్ ముగిసింది.

ఇక పర్సనల్ విషయాలకొస్తే.. 2019 నుంచి ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రాతో డేటింగ్‌లో ఉంది నీలమ్ ఉపాధ్యాయ. 2024 ఏప్రిల్‌లో వీరి ఇరువురికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ప్రస్తుతం నీలమ్ ఉపాధ్యాయ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బీచ్‌లో బికినీతో పోజులిచ్చి.. కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది ఈ బ్యూటీ. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

ఇది చదవండి: ఆహా.! ఏం వయ్యారం గురూ.. అప్పుడేమో పద్దతిగా చుడీదార్‌లో.. ఇప్పుడేమో నడుమందాలతో..

ఇది చదవండి: లవ్‌లీ మూవీ హీరోయిన్ గుర్తుందా? అప్పుడేమో చబ్బీ.. ఇప్పుడేమో అందానికే అటామ్ బాంబ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి