- Telugu News Photo Gallery Cricket photos IPL 2025: Rohit Sharma and Suryakumar Yadav Reportedly Set to Leave Mumbai Indians, Pant To Join CSK Says Reports
IPL 2025: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు
ఐపీఎల్ 2025 మెగా వేలానికి బీసీసీఐ రంగం సిద్దం చేసింది. వేలం మొత్తాన్ని పెంచడం, ప్లేయర్స్ రిటైన్ లిస్టు లాంటి కీలక అంశాలను ఫ్రాంచైజీలతో చర్చించేందుకు ఈ నెల 31న సమావేశం కానుంది. ఆ వివరాలు ఇలా..
Updated on: Jul 23, 2024 | 8:00 AM

ఐపీఎల్ 2025 మెగా వేలానికి బీసీసీఐ రంగం సిద్దం చేసింది. వేలం మొత్తాన్ని పెంచడం, ప్లేయర్స్ రిటైన్ లిస్టు లాంటి కీలక అంశాలను ఫ్రాంచైజీలతో చర్చించేందుకు ఈ నెల 31న సమావేశం కానుంది.

ఈలోగా పలు ఊహించని మార్పులు క్రికెట్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వడంతో పాటు.. నెట్టింట కూడా తెగ వైరల్ అవుతున్నాయి. మరి అవేంటో చూసేద్దామా..

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్.. ఐపీఎల్ 2025కి తన సొంత ఫ్రాంచైజీని విడిచిపెట్టి.. చెన్నై సూపర్ కింగ్స్ చెంతకు చేరనున్నాడట.

మెగా వేలంలోకి రానున్న ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందుగా గుజరాత్ టైటాన్స్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరతాడని టాక్.

ఐపీఎల్ 2025కి గుజరాత్ టైటాన్స్ ఓనర్లు చేంజ్ అవుతున్నారు. ఇక అమ్మకానికి ఉన్న ఈ జీటీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతోందట.

రోహిత్ శర్మతో పాటు జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్‌ను విడిచిపెట్టనున్నారని టాక్. ఇంకా వీరు చేరే జట్లపై క్లారిటీ లేదు.

ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందుగా 4 ఫ్రాంచైజీలు తమ జట్లకు కెప్టెన్లను మార్చనున్నాయి. ఈ లిస్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ముందు వరుసలో ఉన్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ కెప్టెన్ కెఎల్ రాహుల్‌ను విడిచిపెట్టనుంది. ఇక మెగా వేలంలోకి రానున్న కెఎల్ రాహుల్‌ను కొనుగోలు చేసేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొగ్గు చూపుతోందట.

లక్నో సూపర్ జెయింట్స్ వీవీఎస్ లక్ష్మణ్‌ను, కోల్‌కతా నైట్ రైడర్స్ రాహుల్ ద్రావిడ్‌ను హెడ్ కోచ్‌లుగా ఎంపిక చేయాలని ఫ్రాంచైజీలు ఆలోచిస్తున్నాయని సమాచారం.





























