- Telugu News Photo Gallery Cricket photos Sri Lanka Player Chamari Atapattu Smashed First Century In T20 Women's Asia Cup
Asia Cup 2024: 7 సిక్స్‌లు, 14 ఫోర్లు.. తుఫాన్ సెంచరీతో రికార్డుల వర్షం.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర
Chamari Atapattu, Women’s Asia Cup 2024: టీ20 ఫార్మాట్‌లో మెరుపు సెంచరీ సాధించిన తొలి క్రీడాకారిణిగా చమరి అటపట్టు నిలిచింది. ఇంతకుముందు టీ20 ఆసియాకప్‌లో ఏ మహిళా క్రీడాకారిణి సెంచరీ చేయలేదు. దీంతో ఈ లంక ప్లేయర్ తన పేరిట ఓ స్పెషల్ రికార్డ్ లిఖించుకుంది.
Updated on: Jul 23, 2024 | 8:15 AM

శ్రీలంక వేదికగా సోమవారం రాత్రి జరిగిన మహిళల ఆసియాకప్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు 144 పరుగుల భారీ తేడాతో మలేషియా జట్టుపై విజయం సాధించింది. లంక నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన మలేషియా జట్టు కేవలం 40 పరుగులకే ఆలౌటైంది.

అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ చమరి అటపట్టు కేవలం 69 బంతుల్లోనే 119 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది. అటపట్టు ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.

ఈ మెరుపు సెంచరీతో ఈ టీ20 ఫార్మాట్ టోర్నీలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా చమరి అటపట్టు నిలిచింది. ఇంతకుముందు టీ20 ఆసియాకప్‌లో ఏ మహిళా క్రీడాకారిణి సెంచరీ చేయలేదు.

ఈ సెంచరీతో ఆటపట్టు టీ20 కెరీర్‌లో మూడో సెంచరీని నమోదు చేచింది. ఇప్పటి వరకు 136 మ్యాచ్‌లు ఆడి 24.44 సగటుతో 3153 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌లపై కూడా సెంచరీలు సాధించింది.

అంతేకాదు, మలేషియాపై ఆటపట్టు తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు కొట్టి, ఆసియా కప్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఏ మహిళా క్రీడాకారిణి ఆసియా కప్‌లో ఇన్ని సిక్సర్లు కొట్టలేదు.

ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక ఇన్నింగ్స్‌లో గరిష్టంగా 3 సిక్సర్లు కొట్టడం రికార్డుగా నిలిచింది. ఆసియా కప్ 2022లో మలేషియాపై భారత క్రీడాకారిణి షెఫాలీ వర్మ 3 సిక్సర్లు కొట్టింది. అలాగే, భారత క్రీడాకారిణి రిచా ఘోష్ కూడా పాకిస్థాన్‌పై మూడు సిక్సర్లు కొట్టింది.

అతను కాకుండా, 2022 ఆసియా కప్‌లో యూఏఈపై పాకిస్తాన్‌కు చెందిన అలియా రియాజ్ మూడు సిక్సర్లు కొట్టింది. భారత క్రీడాకారిణి స్మృతి మంధాన కూడా 2022లో శ్రీలంకపై మూడు సిక్సర్లు కొట్టగలిగింది. అయితే ఇప్పుడు ఈ రికార్డులన్నీ బద్దలయ్యాయి.




