AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవడు మమ్మీ వీడు.! స్మిత్, హెడ్‌లకే దడ పుట్టించాడు.. 11 బంతుల్లో కర్ణాటక ప్లేయర్ పెను విధ్వంసం

అమెరికా టీ20 లీగ్‌లో కర్ణాటక ప్లేయర్ ఒకడు పెను విధ్వంసాన్ని సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురిపించి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ 21 ఏళ్ల కర్ణాటక బ్యాట్స్‌మెన్.. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ లాంటి స్టార్ ప్లేయర్స్‌ను కూడా వణుకు పుట్టించాడు. ఈ మ్యాచ్..

ఎవడు మమ్మీ వీడు.! స్మిత్, హెడ్‌లకే దడ పుట్టించాడు.. 11 బంతుల్లో కర్ణాటక ప్లేయర్ పెను విధ్వంసం
Cricket
Ravi Kiran
|

Updated on: Jul 23, 2024 | 6:41 PM

Share

అమెరికా టీ20 లీగ్‌లో కర్ణాటక ప్లేయర్ ఒకడు పెను విధ్వంసాన్ని సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురిపించి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ 21 ఏళ్ల కర్ణాటక బ్యాట్స్‌మెన్.. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ లాంటి స్టార్ ప్లేయర్స్‌ను కూడా వణుకు పుట్టించాడు. ఈ మ్యాచ్ మేజర్ లీగ్ క్రికెట్‌లో చోటు చేసుకోగా.. ఆ ప్లేయర్ మరెవరో కాదు సంజయ్ కృష్ణమూర్తి.

సోమవారం వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక బ్యాటర్ సంజయ్ కృష్ణమూర్తి విధ్వంసం సృష్టించాడు. అతడి దూకుడైన బ్యాటింగ్‌తో శాన్‌ఫ్రాన్సిస్కో జట్టు 2 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఫ్రీడమ్‌కు ఓపెనర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ తలో 56 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ స్మిత్ 4 సిక్సర్లు, 5 ఫోర్లు బాదగా, హెడ్ 3 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే

21 ఏళ్ల సంజయ్ కృష్ణమూర్తి సంచలనం..

డక్‌వర్త్ లూయిస్ ప్రకారం, శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌ 14 ఓవర్లలో 177 పరుగుల లక్ష్యాన్ని చెధించాలి. అయితే ఆ జట్టు తొలి బంతికే ఫిన్ అలెన్ వికెట్‌ను కోల్పోయింది. కానీ వన్‌డౌన్‌లో దిగిన సంజయ్ కృష్ణమూర్తి.. వాషింగ్టన్ ఫ్రీడమ్ విజయానికి అడ్డంగా నిలిచాడు. తన జట్టును అద్భుత విజయాన్ని అందించేలా చేశాడు. సంజయ్ కృష్ణమూర్తితో పాటు జోస్ ఇంగ్లీష్ మూడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇరువురూ సిక్సర్లతో హోరెత్తించారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 21 ఏళ్ల సంజయ్ కృష్ణమూర్తి చివరి వరకు నాటౌట్‌గా నిలిచి కేవలం 42 బంతుల్లో 6 సిక్సర్లు, 5 ఫోర్లతో 79 పరుగులు చేశాడు. అవతలి ఎండ్ నుంచి జోస్ ఇంగ్లీష్ కూడా 6 సిక్సర్లు బాది 17 బంతుల్లో 45 పరుగులు చేశాడు.

సంజయ్ కృష్ణమూర్తితో కర్ణాటక రిలేషన్..

అమెరికాలో క్రికెట్ ఆడుతున్న సంజయ్ కృష్ణమూర్తికి కర్ణాటకకి సంబంధమేంటి? ఈ 21 ఏళ్ల ఆల్ రౌండర్ కర్ణాటక అండర్-16 జట్టు తరఫున క్రికెట్ ఆడాడు. అంతేకాకుండా అతడి కుటుంబం మూలాలు కూడా కర్ణాటకతో ముడిపడి ఉన్నాయి.

ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us