వీళ్లసలు మనుషులేనా.. బతికుండగానే ఇద్దరు మహిళలను సజీవంగా పూడ్చిపెట్టారు.. కట్ చేస్తే

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తమ ప్రాంతంలో రహదారి నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఇద్దరు మహిళలను కంకరతో సజీవంగా పూడ్చిపెట్టారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

వీళ్లసలు మనుషులేనా.. బతికుండగానే ఇద్దరు మహిళలను సజీవంగా పూడ్చిపెట్టారు.. కట్ చేస్తే
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 23, 2024 | 9:00 AM

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తమ ప్రాంతంలో రహదారి నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఇద్దరు మహిళలను కంకరతో సజీవంగా పూడ్చిపెట్టారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మంగవా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హినోటా జోరోట్‌ గ్రామంలోని ఓ ప్రైవేట్‌ భూమిలో రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మమతా పాండే, ఆశాపాండే అనే ఇద్దరు మహిళలను కంకరతో సజీవంగా పూడ్చిపెట్టారు.

శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కంకర లోడ్‌తో సజీవంగా పూడ్చిపెట్టిన ఆ ఇద్దరు మహిళలను.. కొద్దిసేపటికి స్థానికులు వారిని రక్షించారు. అనంతరం చికిత్స నిమిత్తం సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం కుదటపడిందని.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని పోలీసులు తెలిపారు.

కాగా, ఈ వైరల్ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. డంపర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన ఒకర్ని అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీ జైదీప్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఇది భూవివాదానికి సంబంధించిన కుటుంబ వ్యవహారమని చెప్పారు. అటు ఈ సంఘటన స్థానికంగా రాజకీయ దుమారానికి దారితీసింది.

ఇది చదవండి: అప్పుడేమో రౌడీ బేబీ.. ఇప్పుడేమో వయ్యారాల నాటీ.. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి