Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు పలు స్టార్ ప్లేయర్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఐపీఎల్ 2024 రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ స్టార్ బౌలర్.. అతడు ఎవరో తెల్సా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

IPL 2025: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా
Srh
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 23, 2024 | 6:08 PM

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు పలు స్టార్ ప్లేయర్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఐపీఎల్ 2024 రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను వచ్చే సీజన్‌కు ముందే విడుదల చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2021లో సన్‌రైజర్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు ఉమ్రాన్. తన వేగంతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాతి సీజన్‌కు ఈ రైట్ ఆర్మ్ సీమర్‌ను రూ. 4 కోట్లు పెట్టి మరీ తమ దగ్గర అట్టిపెట్టుకుంది హైదరాబాద్ ఫ్రాంచైజీ. భువనేశ్వర్ తర్వాత తమ జట్టుకు ప్రధాన సీమర్‌గా ఉమ్రాన్ మాలిక్‌ను తీర్చిదిద్దింది SRH.

ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే

ఇవి కూడా చదవండి

అయితే ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శన గడి తప్పింది. దీంతో ఈ ‘జమ్మూ ఎక్స్‌ప్రెస్’ ఫాస్ట్ బౌలర్‌కు ఐపీఎల్ 2024లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే అవకాశం దొరికింది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. చాలా జట్లు ఉమ్రాన్ మాలిక్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయని జాతీయ క్రికెట్ మీడియా పేర్కొంది. లైన్ అండ్ లెంగ్త్‌లో ఇప్పటికీ అదే స్పీడ్ చూపిస్తోన్న ఉమ్రాన్ మాలిక్. ఎకానమీ విషయంలోనే పేలవం అవుతూ వస్తున్నాడు. దీని వల్లే ఫ్రాంచైజీలు అతడ్ని సీజన్‌లో ఎక్కువ మ్యాచ్‌లు బెంచ్‌కే పరిమితం చేస్తున్నాయ్.

ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే.. 2021లో SRH తరపున అరంగేట్రం చేసిన ఈ రైట్ ఆర్మ్ సీమర్.. ఆ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి.. రెండు వికెట్లు తీశాడు. 2022 ఉమ్రాన్ మాలిక్‌కు అత్యుత్తమ ఐపీఎల్ సీజన్. అతడు 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 2023 ఐపీఎల్ సీజన్ నుంచి మాలిక్ పతనం ప్రారంభమైంది. గత రెండు సీజన్‌లలో అతడికి కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. కాగా, ఉమ్రాన్‌ను విడుదల చేస్తే.. SRHకి ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా రూ. 4 కోట్లు లాభం అని చెప్పొచ్చు. ఇక బీసీసీఐ.. నెక్స్ట్ సీజన్ కోసం ఫ్రాంచైజీ శాలరీ క్యాప్‌ను రూ. 90 కోట్ల నుంచి రూ. 120 కోట్లకు పెంచవచ్చునని టాక్.

ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..