Rohit Sharma: రికార్డులపై కన్నేసిన హిట్‌మ్యాన్.. లంకలో ఇక ఊచకోతే.. అవేంటంటే?

Rohit Sharma BIG Records in Colombo: తన కెప్టెన్సీతోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టిన రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును ఛాంపియన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న హిట్‌మ్యాన్.. మళ్లీ యాక్షన్‌లోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా మరోసారి ఫ్యాన్స్‌ను కనువిందు చేసేందుకు రెడీ అవుతున్నాడు. రోహిత్, ఇతర సీనియర్ ఆటగాళ్లు సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో నేరుగా ఆడతారని ఇంతకుముందు వార్తలు వినిపించాయి. కానీ, అలా జరగలేదు. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా శ్రీలంక సిరీస్‌లో భాగమయ్యాడు.

Rohit Sharma: రికార్డులపై కన్నేసిన హిట్‌మ్యాన్.. లంకలో ఇక ఊచకోతే.. అవేంటంటే?
Rohit Sharma
Follow us

|

Updated on: Jul 23, 2024 | 2:29 PM

Rohit Sharma BIG Records in Colombo: తన కెప్టెన్సీతోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టిన రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును ఛాంపియన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న హిట్‌మ్యాన్.. మళ్లీ యాక్షన్‌లోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా మరోసారి ఫ్యాన్స్‌ను కనువిందు చేసేందుకు రెడీ అవుతున్నాడు. రోహిత్, ఇతర సీనియర్ ఆటగాళ్లు సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో నేరుగా ఆడతారని ఇంతకుముందు వార్తలు వినిపించాయి. కానీ, అలా జరగలేదు. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా శ్రీలంక సిరీస్‌లో భాగమయ్యాడు.

శ్రీలంక పర్యటనలో, భారత్ మొదట జులై 27 నుంచి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ODI మ్యాచ్‌లు ఉంటాయి. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌లో, అతను కొన్ని భారీ రికార్డులను సృష్టించే అవకాశం ఉంటుంది.

వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. ఈ ఫార్మాట్‌లో అతని పేరిట మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు తన వన్డే కెరీర్‌లో, రోహిత్ 262 మ్యాచ్‌లలో 49.12 సగటుతో 10709 పరుగులు చేశాడు. టీమ్ ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక సిరీస్‌లో అతను ఐదో స్థానం సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ పేరులో 10768 పరుగులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో, రోహిత్‌ను అధిగమించడానికి 59 పరుగులు మాత్రమే కావాలి.

వన్డేల్లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ల గురించి మాట్లాడుకుంటే, ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (18426) మొదటి స్థానంలో, విరాట్ కోహ్లీ (13848) రెండవ స్థానంలో, సౌరవ్ గంగూలీ (11221) మూడవ స్థానంలో ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. అదే సమయంలో, ఇప్పుడు అతను కెప్టెన్‌గా కూడా ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌లో రోహిత్ 3 సిక్సర్లు బాదిన వెంటనే మొదటి స్థానాన్ని ఆక్రమిస్తాడు. ప్రస్తుతం రోహిత్ పేరిట 231 సిక్సర్లు ఉన్నాడు. అగ్రస్థానంలో ఉన్న ఇయాన్ మోర్గాన్ 233 సిక్సర్లు కొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..