AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crop Loan Waiver Scheme: తెలంగాణలో రైతు రుణమాఫీ ఎప్పుడు..? ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా..

ప్రజాభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామని.. రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఇష్టమొచ్చినట్టు రైతుభరోసా ఇవ్వబోమని.. రైతులతో మాట్లాడి, విధివిధానాలు రూపొందిస్తామన్నారు.

Crop Loan Waiver Scheme: తెలంగాణలో రైతు రుణమాఫీ ఎప్పుడు..?  ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా..
Crop Loan Waiver Scheme
Shaik Madar Saheb
|

Updated on: Jun 27, 2024 | 4:00 PM

Share

ఆరు నూరైనా రైతు రుణమాఫీ చేసి తీరుతామని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఆగస్టులోగా రెండు లక్షలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తామని.. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరన్నారు. ప్రజాభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామని.. రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఇష్టమొచ్చినట్టు రైతుభరోసా ఇవ్వబోమని.. రైతులతో మాట్లాడి, విధివిధానాలు రూపొందిస్తామన్నారు. అన్ని హామీలు అమలు చేస్తామని భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

గత ప్రభుత్వ పాలనలో మిషన్ భగీరథ పేరుతో 42వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. KCR ఇంటింటికి మంచినీళ్లు ఇస్తే.. కొత్తగూడెంలో తాము మళ్లీ 125కోట్లతో పనులు ఎందుకు చేపడతామని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తామని… రాష్ట్ర ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటామని భట్టి పేర్కొన్నారు. రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని.. త్వరలో శుభవార్త వింటారని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. త్వరలో ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు పారిస్తమన్నారు. కొత్తగూడెం పాల్వంచ రెండు పట్టణాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు, స్థానికంగా ఐటీ హబ్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వదు ఇవ్వదు అని ప్రచారం చేశారని.. కానీ.. తాము ఒకేసారి 7,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని భట్టి పేర్కొన్నారు.

Bhatti Vikramarka

పంట వేయని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశరాు. దీనిపై అన్నదాతల అభిప్రాయాలు తీసుకుంటున్నామన్న ఆయన…ఆలస్యమైనా రైతుకు మేలు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో 9వేల కోట్లు రూపాయలు ఖర్చు చేసినా..ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ఫైరయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. గతంలో కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు పేరు మార్చి..అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేలా ఆరు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేయబోతున్నామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. ఇప్పటికే కేంద్రమంత్రి గడ్కరీ ఆదేశాలతో సెప్టెంబర్‌లో పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..