AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS Party: స్వయంగా డ్రైవింగ్ చేస్తున్న కేసీఆర్.. ఎందుకంటే..

ఫామ్ హౌస్‎లో కారు నడుపుతున్న కేసీఆర్. ఇదేదో సరదా కోసం కాదు డాక్టర్ల సూచన మేరకు ఆయన ప్రతిరోజు మాన్యువల్ కారును డ్రైవ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓల్డ్ మోడల్ మారుతి ఓమ్ని వెహికల్‎ని తెప్పించారు. కొన్ని నెలల క్రితం కేసీఆర్‎కు తుంటి ఎముకకు ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి మెల్లమెల్లగా నడక ప్రారంభించాలని డాక్టర్లు సూచించారు. ఇప్పుడు రెండవ దశలో తుంటి గట్టి పడాలంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్న కారు డ్రైవ్ చేయమని డాక్టర్లు సూచించారు. ఇందుకోసమే ఆయనే మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్న ఓమ్ని వెహికల్‎ని వాడుతున్నారు.

BRS Party: స్వయంగా డ్రైవింగ్ చేస్తున్న కేసీఆర్.. ఎందుకంటే..
Kcr
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Jun 27, 2024 | 3:43 PM

Share

ఫామ్ హౌస్‎లో కారు నడుపుతున్న కేసీఆర్. ఇదేదో సరదా కోసం కాదు డాక్టర్ల సూచన మేరకు ఆయన ప్రతిరోజు మాన్యువల్ కారును డ్రైవ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓల్డ్ మోడల్ మారుతి ఓమ్ని వెహికల్‎ని తెప్పించారు. కొన్ని నెలల క్రితం కేసీఆర్‎కు తుంటి ఎముకకు ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి మెల్లమెల్లగా నడక ప్రారంభించాలని డాక్టర్లు సూచించారు. ఇప్పుడు రెండవ దశలో తుంటి గట్టి పడాలంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్న కారు డ్రైవ్ చేయమని డాక్టర్లు సూచించారు. ఇందుకోసమే ఆయనే మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్న ఓమ్ని వెహికల్‎ని వాడుతున్నారు. దీనివల్ల క్లచ్, గేర్, ఎక్స్లెటర్‎ని పదేపదే నొక్కడంతో కాళ్లు తుంటి వెముకలు కట్టిపడతాయని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రోజూ వారి వ్యాయామంలో భాగంగా ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఆయన ఓమ్ని వాహనంలోనే ఫామ్ హౌస్ మొత్తం చుట్టేస్తున్నారు. నిజానికి కేసిఆర్‎కి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం.

నాయకులతో సమావేశాలు అక్కడి నుంచే..

గతంలో తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు కార్ ర్యాలీలో భాగంగా ఆయనే స్వయంగా కారు నడిపారు. ఆ తర్వాత ఎంజి కంపెనీకి సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ కారు కూడా కొనుగోలు చేసి ఆయన ఫార్మ్ హౌస్‎లో ఉపయోగించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోవడంతో తన ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు కేసీఆర్. అక్కడే వ్యవసాయం చేస్తూ కొత్త వంగడాలను పండిస్తున్నారు. అందులోనూ తుంటి ఎముక గాయం తరువాత కొన్ని రోజులు నంది నగర్ లో నివాసం ఉన్నారు. ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లో గడుపుతున్నారు. ఏవైనా పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించాలన్నా తన ఫామ్ హౌస్ వద్దకే నాయకులను పిలిపించుకుని చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే వ్యూహాలనకు పదునుపెడుతున్నారు. ఎలాగైనాసరే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పుంజుకునేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఆరోగ్యం, ఇటు రాజకీయం రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..