కన్నకూతురిపై కన్నేసిన తండ్రి.. కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య..

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్‎లో అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. భర్త మానయ్యను భార్య ఇందిర గొడ్డలితో నరికి కడ తెర్చింది. సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన మానయ్య, ఇందిరా దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు భర్త అనారోగ్య కారణంగా మృతి చెందడంతో సంగారెడ్డిలో కూలీగా పని చేస్తోంది. సుల్తాన్పూర్‎లోని తల్లి తండ్రుల ఇంటి వద్ద ఉంటుంది. చిన్న కూతురుని గ్రామంలోనే వివాహం చేశారు. కొడుకు గత ఆరు నెలల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పెద్ద కూతురు తల్లి ఇందిరా వద్ద ఇంట్లోనే ఉంటుంది.

కన్నకూతురిపై కన్నేసిన తండ్రి.. కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య..
Sangareddy
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 27, 2024 | 5:08 PM

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్‎లో అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. భర్త మానయ్యను భార్య ఇందిర గొడ్డలితో నరికి కడ తెర్చింది. సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన మానయ్య, ఇందిరా దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు భర్త అనారోగ్య కారణంగా మృతి చెందడంతో సంగారెడ్డిలో కూలీగా పని చేస్తోంది. సుల్తాన్పూర్‎లోని తల్లి తండ్రుల ఇంటి వద్ద ఉంటుంది. చిన్న కూతురుని గ్రామంలోనే వివాహం చేశారు. కొడుకు గత ఆరు నెలల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పెద్ద కూతురు తల్లి ఇందిరా వద్ద ఇంట్లోనే ఉంటుంది. మద్యానికి బానిసగా మారిన మానయ్య మత్తులో నరరూప రాక్షసుడిలా మారి కన్న కూతురిపై కన్నేశాడు. నిన్న రాత్రి తాగి భార్య ఇందిరాతో గొడవ పడ్డాడు. అనంతరం మానయ్య కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేని భార్య ఇందిరా భర్తను నరికి చంపింది. చాలా కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. అనంతరం తన భర్తను చంపినట్లు తల్లి కూతుర్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త మానయ్య మృతదేహాన్నిసంగారెడ్డి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని పల్కల్ పోలీస్ స్టేషన్‎కు తరలించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.

జడ్చర్ల విషాదం ఇలా..

ఇలాంటి సంఘటనలు తెలంగాణలో ఈ మధ్య కాలంలో చాలా చోటు చేసుకుంటున్నాయి. గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో కన్నకూతరి ప్రేమకు అడ్డువస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది భార్య. ఏకంగా సుపారీ ఇచ్చి మరీ ప్లాన్ ప్రకారం భర్తను కిరాతకంగా చంపించింది. తీరా ఏమీ ఎరగనట్టు భర్త మృతదేహం వద్ద మొసలి కన్నీరు కార్చింది. మహబూబ్‎నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ శివారులోని రాజీవ్ నగర్ కాలనీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురు ప్రేమ వ్యవహారానికి అడ్డు చెప్పడమే ఆ తండ్రికి మరణ శాసనమయ్యింది. ప్రేమ పెళ్లి వద్దని కూతురిని గట్టిగా మందలించి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తండ్రిని పరలోకానికి పంపించేసింది భార్య. కుటుంబంలో ఓ చిన్న సమస్య ఆ ఇంట పెద్ద హత్యకు దారీ తీసింది. ఈ ఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇలాంటివి తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles