Telangana: వీళ్లసలు తల్లిదండ్రులేనా.. ఏకంగా పదకొండో సంతానాన్ని.. చివరకు ఊహించని విధంగా..
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లిదండ్రులు పేగు బంధాన్ని తెంచేసుకునేందుకు ప్రయత్నించారు. కన్న పేగును డబ్బుతో ముడి పెట్టి ఇతరులకు అమ్మేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ బాబును కొన్న వాళ్లు...

చిన్నారులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లిదండ్రులు పేగు బంధాన్ని తెంచేసుకునేందుకు ప్రయత్నించారు. కన్న పేగును డబ్బుతో ముడి పెట్టి ఇతరులకు అమ్మేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ బాబును కొన్న వాళ్లు ఇంకొంత ఎక్కువ డబ్బుకు వేరే దగ్గర అమ్మేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కంగుతిన్నారు. తమకు న్యాయం చేయాలంటూ చైల్డ్ లైన్ సిబ్బందిని వేడుకుంటున్నారు. అయితే..వారు అమ్మేసింది పదకొండో సంతానం కావడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకపల్లి మండలం చలమన్న నగర్ గ్రామానికి చెందిన ఆదికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరికి పదకొండు మంది సంతానం. మొదటి భార్య చనిపోవడంతో మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. మరణించే నాటికి మొదటి భార్యకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఈ క్రమంలో రెండో భార్యకు ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు కుమారులు జన్మించారు. ఈ ఏడాది అక్టోబరు 30న కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో మరో మగబిడ్డ జన్మించాడు. దీంతో పిల్లలు పోషణను భారంగా భావించిన ఆ దంపతులు బిడ్డను అమ్మేందుకు సిద్ధమయ్యారు.
విషయం తెలుసుకున్న ఓ మహిళ.. వీరి వద్దకు వచ్చింది. తమ బంధువులకు పిల్లలు లేరని, పెంచుకునేందుకు బాబును ఇవ్వాలని అడిగింది. దీనికి ఆది దంపతులు ఒప్పుకోలేదు. అనంతరం నవంబర్ 22న కొత్తగూడెం గరిమెళ్లపాడుకు చెందిన కొందరు వీరివద్దకు వచ్చారు. తమకు పిల్లలు లేరని బాబును పెంచుకుమటామని అడిగారు. అందుకు వారు రూ.90వేలు ఆది దంపతులకు ఇచ్చి చిన్నారిని తీసుకెళ్లారు. అయితే పెంచుకుంటామని తీసుకెళ్లిన వాళ్లు బాబును విక్రయించినట్లు ఆది దంపతులకు తెలిసింది. దీంతో చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించారు.
వారు వెంటనే అలర్ట్ అయ్యి.. క్షేత్ర స్థాయిలో పర్యటించి వివరాలు సేకరించారు. బాలుడిని విక్రయించినట్లు గుర్తించి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాబును స్వాధీనం చేసుకుని చైల్డ్‌లైన్ సిబ్బందికి అందజేశారు. ఈ ఘటనలో పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..