AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nizamabad: అంత చక్కగా నవ్వుతూ డ్యాన్స్ చేసిన వధువు గంటల వ్యవధిలోనే సూసైడ్.. మిస్టరీ మరణం

పెళ్లికి ముందు వరకు హ్యాపీగా ఉంది రవళి. హల్దీ ఫంక్షన్‌లో కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి ఉత్సాహంగా డాన్స్‌ చేసింది. కానీ అంతలోనే బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Nizamabad: అంత చక్కగా నవ్వుతూ డ్యాన్స్ చేసిన వధువు గంటల వ్యవధిలోనే సూసైడ్.. మిస్టరీ మరణం
Bride Suicide
Ram Naramaneni
|

Updated on: Dec 11, 2022 | 3:14 PM

Share

ప్లేస్.. నిజామాబాద్‌ నవీపేట. ఆ ఇంట్లో అప్పటివరకు అంతా హడావుడి..పెళ్లి సందడి..పచ్చటి తోరణాలు..పూలదండలు.. బంధుమిత్రులతో కళకళలాడిపోయింది ఆ ఇల్లు. మరికొద్దిగంటల్లో పెళ్లి..అంతా సిద్ధమైంది. కానీ అంతలోనే తీరని విషాదం. పెళ్లికూతురిగా ముస్తాబై పెళ్లిపీటలెక్కాల్సిన వధువు ఆత్మహత్య చేసుకుంది. ఉరికొయ్యకు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అందరినీ శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కాబోయే భర్త వేధింపులే రవళి ఆత్మహత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె కుటుంబసభ్యులు. తమ బిడ్డను పెళ్లికొడుకు వేధించాడని..అందుకే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు రవళి తండ్రి. రాత్రి లాస్ట్‌ ఫోన్‌ కాల్ అతనితోనే మాట్లాడిందని..అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఐతే రవళితో రాత్రి పెళ్లి గురించే మాట్లాడానని.. జాబ్‌ చేయాలని ఫోర్స్‌ చేయలేదంటున్నాడు పెళ్లికొడుకు సంతోష్‌. ఆస్తిలో వాటా కోరిన మాట అవాస్తవమంటున్నారు. నవీపేటలో రవళి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. రవళి తల్లిదండ్రుల ఫిర్యాదుతో సంతోష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. రవళి, సంతోష్‌ కాల్‌డేటా వివరాలను సేకరిస్తున్నారు. పెళ్లికొడుకు వేధింపులకు గురి చేశాడా.? మానసికంగా టార్చర్‌ పెట్టాడా..? లేక మరెవరైనా ఆమెను బెదిరించారా.. లేదా ఇంకేదైనా కారణం అన్నది విచారణలో తేలనుంది. హల్ది ఫంక్షన్‌లో అంత చక్కగా నవ్వుతూ డ్యాన్స్ చేసిన పిల్ల.. గంటల వ్యవధిలో సూసైడ్ చేసుకోవడంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో బలమైన రీజన్‌ ఉండే ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

సమస్య ఏదైనా..  తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పి ఉంటే సరిపోయేది. చనిపోవడానికి సిద్ధపడిందే కానీ తన బాధకు కారణం ఏంటో ఇంట్లో వాళ్లకు చెప్పలేకపోయింది. ఫలితం కాళ్ల పారాణి ఆరకముందే రవళి జీవితం ముగిసిపోయింది. పెళ్లి జరగాల్సిన టైమ్‌కే పచ్చటి తోరణాలు, పూలదండలు తీసివేయడం అందరినీ కలిచివేసింది. మ్యారేజ్‌కు కొన్ని గంటలకు ముందు..అమ్మాయి సూసైడ్‌ చేసుకోవడంతో విషాదం నెలకొంది.

Follow Us
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ