Cyclone Arnab: తీవ్ర తుఫాన్‌గా బలహీనపడి తీరం దాటిన అర్నబ్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ఎట్టకేలకు తీరం దాటింది. బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారిన అర్నబ్.. యానాం-నరసాపురం మధ్య తీరం దాటినట్టు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. తీరం దాటిన సమయంలో 125-135 కి.మీ. వేగంతో గాలులు వీశాయని.. గరిష్ఠంగా గంటకు 150 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నట్టు పేర్కొంది.

అతి తీవ్ర తుఫాన్‌గా ఉన్న అర్నబ్ బలహీన పడి తీవ్ర తుఫాన్‌గా మారింది. ఈ క్రమంలో కోనసీమ సమీపంలో యానాం-నరసాపురం మధ్య తీరాన్ని దాటింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 125-150 కిలో మీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచాయి. అలాగే కోస్తా జిల్లాల వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు
ఇక తుఫాన్ ఎఫెక్ట్‌తో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూ.గో, ప.గో.. కాకినాడ, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు ఆయన తెలిపారు. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. అలాగే అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపారు.
ఆరేంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు
ఇక పల్నాడు, గుంటూరు, విజయనగరం శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు స్పష్టం చేశారు.
లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి,,
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.