AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కరువు కోరల్లో తెలంగాణ.. రాష్ట్రంలో 365 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం

ఎల్‌నీనో ఎఫెక్ట్‌తో తెలంగాణలో కరువు పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని 365 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని.. వీటిలో 111 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈ కరువు పరిస్థితులపై నేడు ప్రభుత్వం అఖిలఫక్ష సమావేశం నిర్వహించనుంది.

Telangana: కరువు కోరల్లో తెలంగాణ.. రాష్ట్రంలో 365 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం
Telangana Govt Declares 365 Drought Hit Mandals
Anand T
|

Updated on: Oct 28, 2026 | 7:39 AM

Share

తెలంగాణ రాష్ట్రంలో కరువు ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ 365 మండలాల్లో 111 మండలాలు తీవ్ర కరువును ఎదుర్కొంటున్నాయని.. మిగతా 254 మండలాలు మోస్తరు కరువు ప్రభావంతో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కరవు పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. కరవు ప్రభావిత మండలాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఆదేశించింది.

కరువు పరిస్థితులు వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కరువు కారణంగా పంటలు నాశనం అవుతున్నాయి, నీటి కొరత ఏర్పడుతోంది, ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి. దీంతో కరువు మండలాల్లో ప్రత్యేక రవాణా, ఆహార సరఫరా, వైద్య సేవలు అందించడానికి సిద్ధమైనట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు ఇటు రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, కరువు పరిస్థితులపై నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో.. పంటల నష్టం, తాగునీటి సరఫరా, విద్యుత్ డిమాండ్ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనున్న సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నుంచి ఇద్దరు ప్రతినిధులకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయా పార్టీల నుంచి కరవు నివారణకు సూచనలు, సలహాలు స్వీకరించనుంది ప్రభుత్వం.

ముఖ్యంగా వ్యవసాయం, అనుబంధ రంగాలపై కరవు ప్రభావం, రైతులు, రైతు కూలీలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు, కృష్ణా పరీవాహకంలో అధికంగా కనిపిస్తున్న కరవు తీవ్రత , గోదావరి పరీవాహకంలోని పలు ప్రాజెక్టుల్లోనూ తగ్గిన నీటి నిల్వలు , ఏడు లక్షల ఎకరాలకు చివరి తడులు అందించే స్థాయిలోనే నీటి నిల్వలు , వచ్చే ఏడాది ఆగస్టు వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని జలాశయాల నీటి వినియోగంపై ఆంక్షలు, 318 మండలాల్లో ప్రమాదకర స్థాయికి చేరిన భూగర్భ జలాలు , తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణపై ప్రత్యేక చర్చ జరపనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us