చాణక్య నీతి : పురుషులు ఈ పని చేస్తే నాశనమే!

samatha

27 october 2026

Pic credit - Pinterest

ఆ చార్య చాణక్యుడు, తన కాలంలో అత్యంత జ్ఞానవంతులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.

ఆచార్య చాణక్యుడు

ఆయన గొప్ప రాజయకీయ వేత్త , తత్వవేత్త. చాణక్యుడు చాలా గొప్ప విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

రాజకీయ వేత్త

ముఖ్యంగా నీతి శాస్త్రం అనే పుస్తకం రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి ఆయన తెలియజేశాడు.

నీతి శాస్త్రం పుస్తకం

అదే విధంగా మగవారు అస్సలే చేయకూడని కొన్ని పనుల గురించి ఆయన తెలిపాడు. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మగవారు అస్సలే చేయకూడని పనులు

చాణక్యుడి ప్రకారం పురుషులకు కోపం సహజం. కానీ ఆ సమయంలో ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు. అది కొన్ని సార్లు జీవితాలనే నాశనం చేస్తుందంట.

కోపంలో నిర్ణయాలు

అంతే కాకుండా ప్రతి పురుషుడు స్త్రీలను గౌరవించాలి. స్త్రీలను గౌరవించని పురుషులు తమ జీవితాన్ని సమస్యల్లోకి నెట్టి వేస్తారంట.

స్త్రీని గౌరవించడం

అంతే కాకుండా ఒక పురుషుడు ఎప్పుడూ కూడా మంచి వ్యక్తితో స్నేహం చేయాలి. లేకపోతే అది కష్టాలను తీసుకొస్తుంది.

మంచి వ్యక్తితో స్నేహం

ఆచార్య చాణక్యుడి ప్రకారం, పురుషులు ఎప్పుడూ కూడా తమ రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదంట. అది కష్టాలు, నష్టాలకు కారణం అవుతుంది.

రహస్యాలు పంచుకోకూడదు