తిరుమల శ్రీవారి ఆలయం వద్ద పుష్ప 2 పాటకు రీల్స్ చేసిన ఒక జంటపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడాలని, ఇలాంటి వినోద కార్యకలాపాలు నిషేధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయ పవిత్రతను గౌరవించాలని భక్తులకు విజ్ఞప్తి.