RBI మళ్లీ కొత్త రూ.1000 నోట్లను ప్రవేశపెడుతోందా? కేంద్రం ఏం చెప్పింది!

October 28, 2026

Subhash

నోట్ల రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి నోట్లను చలామణి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. 

నోట్ల రద్దు సమయంలో 

ఈ నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. వీటి స్థానంలో రూ.2 వేల నోట్లు తీసుకురాగా.. ఆ తర్వాత వాటిని కూడా చలామణి నుంచి ఉపసంహరించుకుంది. 

ఆర్బీఐ వెనక్కి

అయితే త్వరలో రూ.వెయ్యి నోట్లను ఆర్బీఐ మళ్లీ ప్రవేశపెట్టనుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.

రూ.వెయ్యి నోట్లను

పసుపు రంగు, ఆలయం బొమ్మతో ఉన్న రూ.వెయ్యి నోట్లకు సంబంధించిన నకిలీ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. 

నకిలీ ఫొటోలు

దీంతో ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు దీనిపై క్లారిటీ ఇస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.

 కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 

నకిలీ రూ.1,000 నోటు హెచ్చరిక. కొత్త 1,000 రూపాయల నోటు జారీ చేయబడిందని పలు సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి. 

నకిలీ రూ.1,000 నోటు 

కొత్త 1,000 రూపాయల నోటు జారీకి సంబంధించి ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆర్బీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. 

కొత్త రూ.1,000 నోటు జారీకి

ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక మూలాల ద్వారా మాత్రమే కన్ఫర్మ్‌ చేసుకోవాలని పీఐబీ సూచిస్తోంది.

అధికారిక మూలాల ద్వారా