AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఏసీబీ వలలో మీర్‌చౌక్‌ ఇన్స్‌పెక్టర్‌, హోంగార్డ్‌..!

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని మీర్‌చౌక్‌ ఇన్స్‌పెక్టర్‌, హోంగార్డ్‌ ఏసీబీ వలలో చిక్కారు. అయితే సీఐ కొండల్‌ రావు రూ.6 లక్షల లంచం డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ హోంగార్డ్‌ ఏసీబీకి చిక్కారు. సీఐ కొండల్‌ రావు ఆదేశాలతోనే..

Hyderabad: ఏసీబీ వలలో మీర్‌చౌక్‌ ఇన్స్‌పెక్టర్‌, హోంగార్డ్‌..!
Acb
Subhash Goud
|

Updated on: Oct 27, 2026 | 11:21 PM

Share

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని మీర్‌చౌక్‌ ఇన్స్‌పెక్టర్‌, హోంగార్డ్‌ ఏసీబీ వలలో చిక్కారు. అయితే సీఐ కొండల్‌ రావు రూ.6 లక్షల లంచం డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ హోంగార్డ్‌ ఏసీబీకి చిక్కారు. సీఐ కొండల్‌ రావు ఆదేశాలతోనే లంచం తీసుకున్నట్లు సదరు హోంగార్డ్‌ అబిద్‌ అలీ ఏసీబీ అధికారులకు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓ కేసు మూసివేతకు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో సీఐ కొండల్‌రావు, హోంగార్డ్‌ అబిద్‌ అలీని అరెస్ట్‌ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు నిందితులను నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు.

అయితే పోలీసులు, ఏసీబీ వర్గాల సమాచారం ప్రకారం.. పాతబస్తీ ఏరియాలో ఓ స్థలానికి సంబంధించిన సివిల్ వివాదంలో ఇన్‌స్పెక్టర్ కొండల్‌రావు జోక్యం చేసుకున్నారని, ఈ వ్యవహారాన్ని అనుకూలంగా పరిష్కరించేందుకు బాధితుడి నుంచి ముందుగా రూ. 10 లక్షల వరకు డిమాండ్ చేశారని తెలుస్తోంది. అయితే బాధితుడు అంత మొత్తంలో డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో చివరికి రూ. 6 లక్షలకు బేరం కుదుర్చుకున్నాని తెలుస్తోంది. ఈ మొత్తంలో భాగంగా ముందుగా రూ.3 లక్షలు చెల్లించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

చివరికి సీఐ వేధింపులు భరించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అనంతరం పాతబస్తీలోని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేపట్టాయి. కేసు నమోదు చేసిన అధికారులు, నిందితులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..