ఏపీ తీర ప్రాంతంలో అల్లకల్లోలం.. కాసేపట్లో తీరం దాటనున్న అర్నబ్ తుఫాన్.. లైవ్ వీడియో
యానాం సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు, కాకినాడ–యానాం తీరాల్లో ఉప్పెన ముప్పు నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
భీకర తుఫాను అర్నబ్ తీరానికి అత్యంత సమీపంలో కొనసాగుతోంది. నర్సాపూర్‌కు తూర్పున కేవలం 30 కి.మీ, యానానికి 45 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన తుఫాను నెమ్మదిగా కొనసాగుతోంది. తుపాన్ ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ.. రాబోయే 4-5 గంటల పాటు కొనసాగనుంది.. 11.30 టైమ్‌లో యానాం పరిసరాల్లో తుఫాన్ కేంద్రం తీరాన్ని తాకొచ్చని.. ఆ తర్వాత మళ్లీ నేల నుంచి సముద్రంలోకి చేరే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది.. ఆ తర్వాత కాకినాడ జిల్లా U కొత్తపల్లిలో పూర్తిగా నేలను తాకుతుందని వెల్లడించారు. మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్.. యానాం సమీపంలో తీరం దాటే ప్రక్రియ కొనసాగనుంది. 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాకినాడ, యానాం ప్రాంతాల్లో ఉప్పెన ముప్పు పొంచి ఉండగా.. సాధారణం కంటే 2.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. తుపాన్ ప్రభావంతో ఈదురుగాలులు, భారీ వానలు కురిస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు.
సాలె పురుగు కుడితే అంత ప్రమాదమా!
అటు భర్త.. ఇటు లవర్.. ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.. అంటూ..
యజమాని కోసం.. ఎనిమిదేళ్లుగా ఆసుపత్రిలోనే తిరుగుతున్న కోడిపుంజు!
భారత్‌లో ఈ 9 నగరాలు టాప్!
కుక్కను చూసి చిరుత పరుగో.. పరుగు.. ఏం జరిగిందో మీరే చూడండి!
కోతుల బెడదకు చెక్.. బామ్మగారి ఐడియా అదిరిందిగా!
అత్తారింటికి దారేది? అయ్యో.. ఈ నవ వధువుకి ఎంత కష్టం వచ్చింది!
