Hyderabad: హస్టల్లో ఉంటూ ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి.. ఏం జరిగిందంటే..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేగింది. గ్రూప్ 4 పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. గదరి బోయిన శిరీష (24) జవహర్ నగర్‌లోని ఎస్ఆర్ ఉమెన్ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్ 4 పరీక్షలకు సిద్ధమయ్యారు.

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేగింది. గ్రూప్ 4 పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. గదరి బోయిన శిరీష (24) జవహర్ నగర్‌లోని ఎస్ఆర్ ఉమెన్ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్ 4 పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు శిరీష.
మహబూబాబాద్‌కు చెందిన శిరీష.. గత కొంత కాలంగా.. జవహర్ నగర్‌లోని ఎస్సార్ బాలికల హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా గ్రూప్ ఫోర్ పరీక్షకు కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాశారు. ఇక కొన్ని రోజుల క్రితమే గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు విడుదల చేశారు అధికారులు. ఈ క్రమంలో శిరీషకు గ్రూప్ 4 ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయి. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి.. హాస్టల్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన వసతిగృహ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా చేరుకున్న పోలీసులు.. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే శిరీష.. గ్రూప్ 4లో మార్కులు తక్కువ వచ్చినందుకే ఆత్మహత్య చేసుకుందా లేక మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొలువు లేకుంటే బతుకు లేదనుకున్నావా బిడ్డా.. ఎందుకు ఇంత ఘోర నిర్ణయం తీసుకున్నావు.. అమ్మానాన్న గుర్తుకు రాలేదా అని శిరీష తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. నిరుద్యోగం నేటి యువతకు పెనుశాపంగా మారింది. అందులోనూ ప్రతి ఒక్కరూ సర్కార్ కొలువులపైనే గంపెడు ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ తరహా విధానానికి స్వస్తి పలికి ఏదైనా తన ప్రతిభకు తగ్గ ఉద్యోగం చూసుకుంటే ఇలాంటి అఘాయిత్యాలకు కొంత అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




