Long Drive Cars Case: లాంగ్ డ్రైవ్ కార్స్ ముసుగులో ఆరాచకాలు.. ఆడ, మగ తేడా లేకుండా..

అద్దెకు కార్లను అందించే లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాధితులను బంధించి చావబాదిన ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. చేస్తే తమ దగ్గర ఉద్యోగం చేయాలి.. లేదంటే చావు దెబ్బలు తినాలి.. ఇదే లాంగ్ డ్రైవ్ కార్స్ తీరు. ఉద్యోగం పేరుతో అభం శుభం తెలియని యువతులను మభ్యపెట్టి లోబర్చుకుంటారు. అడ్డు చెబితే వేధింపంలు చిత్రహింసలు, యువకుల పరిస్థితి మరీ దారుణం.

Long Drive Cars Case: 	లాంగ్ డ్రైవ్ కార్స్ ముసుగులో ఆరాచకాలు.. ఆడ, మగ తేడా లేకుండా..
Long Drive Cars
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 16, 2024 | 6:10 PM

అద్దెకు కార్లను అందించే లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాధితులను బంధించి చావబాదిన ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. చేస్తే తమ దగ్గర ఉద్యోగం చేయాలి.. లేదంటే చావు దెబ్బలు తినాలి.. ఇదే లాంగ్ డ్రైవ్ కార్స్ తీరు. ఉద్యోగం పేరుతో అభం శుభం తెలియని యువతులను మభ్యపెట్టి లోబర్చుకుంటారు. అడ్డు చెబితే వేధింపంలు చిత్రహింసలు, యువకుల పరిస్థితి మరీ దారుణం. మాట వినకపోతే చచ్చెట్టు కొడతారు. బాధితులు బయటకు వచ్చి చెప్పటానికి భయం తో వణికిపోతున్నారు అంటే పరిస్థితి వారి అర్ధంచేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్ కార్స్ యజమాని కొప్పుల హరిదీప్ రెడ్డి నిర్వాకం చూసి పోలీసు ఉన్నతాధికారులు సైతం షాకవుతున్నారు.

లాంగ్ డ్రైవ్ కార్స్.. ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ కార్లను అద్దెలకు అందించే సంస్థ అనే విషయం గుర్తొస్తుంది. కానీ వ్యాపారం ముసుగులో లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల దారుణాలు, ఉద్యోగులను బంధించి దాడి చేసిన ఘటనతో బయటపడ్డాయి. లాంగ్ డ్రైవ్ కార్స్ హైదరాబాద్ మహానగరం శివారు మేడిపల్లి బ్రాంచ్‌లో డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌గా పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు జీతాలు సరిపోక జాబ్‌లు వదులుకున్నారు. అలా లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు తమ సొంతంగా స్టార్టప్ కు ప్లాన్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న లాంగ్ డ్రైవ్స్ కార్ ఓనర్ కొప్పుల హరిదీప్ రెడ్డి.. గత ఉద్యోగులంతా కొత్తగా పెడుతున్న స్టార్టప్ కంపెనీపై దాడి చేశాడు. దాదాపు ముప్పై మంది అనుచరులతో కలిసి 8 మంది ఉద్యోగులపై దాడికి తెగబడ్డారు. చేతికి దొరికిన వస్తువులతో చావబాదాడు. మేడిపల్లిలోని పలు ప్రాంతాలు తిప్పుతూ రాత్రి రెండు మూడు గంటల వరకు అమ్మాయిలను, అబ్బాయిలను బంధించి కొట్టారు. కాగా, ఇప్పటికీ తేజ అనే యువకుడి ఆచూకీ లభించకపోవడంతో వారి చెర నుండి బయటపడి బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

దాడిలో తీవ్ర గాయలపాలయిన వారిని చూసి వైద్యులే షాక్ అయ్యారు. ఈ ఘటన అనంతరం దాడి నుంచి బయటపడిన యువతీ యువకులు తమపై జరిగిన పైశాచికత్వంపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా ప్రస్తుతం లాంగ్ డ్రైవ్ కార్స్ ఓనర్ హరిదీప్ రెడ్డి తో పాటు దాడికి తెగబడిన నిందితులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. దాడికి గురైన వారిలో తేజ అనే యువకుడి ఆచూకి లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు భయాందోళనలో ఉన్నారు.

ఇక లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల దాడులతో వారి చీకటి బాగోతాలను బయట పెట్టారు బాధిత యువతులు. అమ్మాయి బాగుంటే విద్యార్హతతో పని లేకుండా ఉద్యోగమిచ్చి ఆ తరువాత లోబరుచుకునే ప్రయత్నం చేస్తారని, అడ్డు చెబితే లైంగిక వేధింపులకు గురించేస్తారని వాపోయారు. జాబ్ లో జాయిన్ అయిన కొన్నాళ్ళకే లాంగ్ డ్రైవ్ కార్ ఓనర్ కొప్పుల హరిదీప్ రెడ్డితో పాటు అతని అనుచరులు అమ్మాయిలతో లాంగ్ టూర్లు ప్లాన్ చేసి మద్యం తాగేలా బలవంతం చేస్తారని, ఆ తరువాత వారిని వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు. భయంకర వాస్తవాలు బయట పెట్టారు బాధితులు.

కొప్పుల హరిదీప్ రెడ్డి తో పాటు దాడికి తెగబడిన అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతున్నారు. లేకపోతే తమ ప్రాణాలకు రక్షణ ఉండదు అంటున్నారు బాదితులు. అంతేకాదు సమగ్ర దర్యాప్తు జరిపితే లాంగ్ డ్రైవ్ యాజమాన్యం అరాచకాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…