AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Crimes: సైబర్ నేరగాళ్లకు అదే ప్లస్ పాయింట్.. ఇలా చేసేముందు కాస్త ఆలోచించండి

సులువుగా డబ్బు సంపాదనకు అలవాటు పడ్డారా ఇక అంతే.. తక్కువ పెట్టబడి ఎక్కువ లాభాలు అంటూ సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Online Crimes: సైబర్ నేరగాళ్లకు అదే ప్లస్ పాయింట్.. ఇలా చేసేముందు కాస్త ఆలోచించండి
Cyber Crime
Vijay Saatha
| Edited By: Srikar T|

Updated on: Feb 17, 2024 | 6:59 AM

Share

సులువుగా డబ్బు సంపాదనకు అలవాటు పడ్డారా ఇక అంతే.. తక్కువ పెట్టబడి ఎక్కువ లాభాలు అంటూ సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ మోసాలకు పాల్పడుతున్న చైనీస్ సైబర్ మోసగాళ్లకు బ్యాంక్ ఖాతాలను అందించిన వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. తిరుపతికి చెందిన శిరీష్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సోషల్ మీడియ, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి ఆన్‌లైన్‌లో ఉత్పత్తులకు రేటింగ్, ప్రకటనల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మోసాలు తరుచు జరుగుతున్నాయి. తాజాగా జరుగుతున్న సైబర్ నేరాల్లో ఎక్కువగా 50శాతం కేసులు ఇన్వెస్ట్మెంట్ మోసాల పేరుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్‎లో కేసులు నమోదు అవుతున్నాయి.

సుమారు 60లక్షల డబ్బును వసూళ్లు చేసి సైబర్ మోసగాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు శిరీష్ కుమార్ బదిలీ చేసాడు. ఇదే కాకుండా సైబర్ మోసగాళ్లతో కుమ్మక్కయి కమిషన్ పొందడానికి ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను రేటింగ్, ప్రకటనలకు పనులు అప్పగించడం లాంటివి చేస్తూ అమాయక ప్రజలను శిరీష్ కుమార్ మోసం చేస్ర్తున్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. అయితే నిందితులు ఒకే రోజులో ఒకే ఖాతాలో 1.5 కోట్లు కొట్టేశారు. వీరిపై దేశ వ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయి. అయితే నిందితుడు శిరీష్.. చైనాకు వెళ్లి చైనా పౌరులతో కార్యకలాపాలు సాగించాడని పోలీసులు ప్రాధమిక నిర్దారణకు వచ్చారు. బాధితులు ఫిర్యాదుతో హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు 66(C), (D) IT చట్టం, 419,420 ఐపీసీ కింద కేసునమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసారు. తరుచు ఇన్వెస్ట్మెంట్ మోసాలు జరుగుతున్నాయని, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాల పేరుతో ఆఫర్స్ ఇస్తూ ఆన్లైన్ ద్వారా వస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోతే అధైర్యపడకుండా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చెయ్యాలని బాధితులకు మేము అండగా ఉంటామని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..