Telangana: బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదురుతుందా..? బండి సంజయ్, మల్లారెడ్డి ఏమన్నారో తెలుసా..?
బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని తెలంగాణలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం చేస్తోంది ఎవరనేది మాత్రం బయటకు తెలియనివ్వట్లేదు. బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఖరా ఖండీగా చెప్పేస్తున్నారు. పైగా వలసలను ఆపడానికి కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇదంటున్నారు.
బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని తెలంగాణలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం చేస్తోంది ఎవరనేది మాత్రం బయటకు తెలియనివ్వట్లేదు. బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఖరా ఖండీగా చెప్పేస్తున్నారు. పైగా వలసలను ఆపడానికి కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇదంటున్నారు. 8 మంది BRS ఎమ్మెల్యేలు, ఐదుగురు సిట్టింగ్ బీఅర్ఎస్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని మీడియాతో చిట్ చాట్‌లో చెప్పారు బండి సజంయ్. అవినీతి పార్టీలతో మోదీ పొత్తు పెట్టుకోరని,.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో చేర్చుకోని ప్రధాని.. ఇప్పుడెందుకు చేర్చుకుంటారన్నారు. కాళేశ్వరంపై రోజూ మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టడం లేదన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ కొట్టినట్లు చేస్తుంటే.. BRS ఎడ్చినట్లు చేస్తుందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ – బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు బండి సంజయ్. దొంగ ఓట్లను తొలగిస్తే.. హైదరాబాద్ పార్లమెంట్ సీటు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమకు రాముడు, మోదీ ఉంటే.. రజాకార్లు, MIM పార్టీలు.. కాంగ్రెస్, BRSకు ఉన్నారన్నారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠను బహిష్కరించిన వాళ్ళను ప్రజలు బహిష్కరిస్తారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. KCR, KTRను జైల్లో పెట్టే వాళ్లమన్నారు బండి సంజయ్. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే.. కాంగ్రెస్ పార్టీ నుంచి షిండేలు వస్తారని జోస్యం చెప్పారు. హరీష్‌రావుపై అన్ని పార్టీ సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నాయని.. బీజేపీలోకి వస్తే చేర్చుకుంటామన్నారు సంజయ్.
మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
రెండు పార్టీల మధ్య పొత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా మాట్లాడారు. బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉంటే తమ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారన్నారు. అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. బండి సంజయ్ తో అయ్యేది లేదు…పొయ్యేది లేదని విమర్శించారు. మల్కాజిగిరి టికెట్ భద్రంగా వుందని.. ఒకవేళ బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉన్నా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం తమదే అన్నారు మల్లారెడ్డి. తన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, తమ కుటుంబం వేరని తెలిపారు. తన కుమారుడుకి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. తమ యూనివర్సిటీలో అక్రమ కట్టడాలు వుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే తాను ఏం చేయలేనన్నారు మల్లారెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..