AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్.. నేరుగా ఐటీ శాఖనే బురడీ కొట్టించిన వైనం..

తెలంగాణలో హెచ్ఎండీఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును తవ్వే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్నులు చెల్లించే విషయంలో ఫేక్ ఐటి రిటర్న్స్ ఫైల్ చేసినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు.

Hyderabad: శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్.. నేరుగా ఐటీ శాఖనే బురడీ కొట్టించిన వైనం..
Sivabalakrishna
Srikar T
|

Updated on: Feb 17, 2024 | 8:09 AM

Share

తెలంగాణలో హెచ్ఎండీఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును తవ్వే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్నులు చెల్లించే విషయంలో ఫేక్ ఐటి రిటర్న్స్ ఫైల్ చేసినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండీఏలో తొమ్మిదేళ్లుగా చక్రం తిప్పారు శివబాలకృష్ణ. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నట్టు చూపిస్తూ ఫేక్ సంస్థలు ఏర్పాటు చేశారు. సౌందర్య బోటిక్, శారి వర్క్స్ పేరుతో ఐటి రిటర్న్స్ దాఖలు చేశారు. ఆర్ధిక ఆదాయాన్ని చూపేందుకు వీరి పేర్ల పై వ్యాపారాలు ఉన్నట్టు సృష్టించి పన్ను ఎగవేతకు కారణం అయ్యారు. ఈ షేల్ కంపెనీల ద్వారా కుటుంబ సభ్యుల పేరుతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు శివబాలకృష్ణ.

తన కూతురు పద్మావతికి కూడా ఆదాయం వస్తుందని చూపించారు. హోమ్ ట్యూషన్స్ ద్వారా వచ్చిన అదాయంతో ఐటీ రిటర్న్ ఫైల్ చేసినట్టు సృష్టించారు. అక్రమ సంపాదనను కవర్ చేసేందుకు ఈ షేల్ కంపెనీల పేరుతో ఆదాయం వచ్చినట్టు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఏసీబీ అధికారుల వలకు చిక్కి కస్టడీ అనుభవిస్తున్నారు. HMDA లో ప్లానింగ్ డైరక్టర్‌గా శివబాలకృష్ణ ఉన్న సమయంలో బిల్డర్లకు, రియల్టర్లకు, ఇన్‌ఫ్రా ఓనర్లకు, ల్యాండ్ వెంచర్ల యజమానుల ఫైల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని, సత్యనారాయణ, భరత్‌ ఇద్దరు శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అనేక భూములు, స్థలాలు వారిద్దరి పేరు మీద ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకెన్ని పరిణామాలు వెలుగులోకి వస్తాయో అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్