AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు..

వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియడంతో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Telangana: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు..
Telangana Mlc Elections
M Revan Reddy
| Edited By: |

Updated on: May 14, 2024 | 10:59 AM

Share

వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియడంతో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

2021లో ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కాలం మార్చి 2027 వరకు ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలన్న నిబంధనలు ఉన్నాయి. దీంతో ఈ స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నికను నిర్వహిస్తోంది.

బరిలో 52 మంది అభ్యర్థులు..

ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ – ఖమ్మం -నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. 12 జిల్లాల్లో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 2,87,007 మంది పురుషులు కాగా, 1,74,794 మంది మహిళలు, ఇతరులు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ హరి చందన వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానానికి నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 63 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రధాన పార్టీల అభ్యర్థులుగా..

కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పోటీ చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఈసారి ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బిజెపిలో చాలా కాలం పని చేసిన రాకేష్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరారు. రాకేష్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. బిజెపి అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. 2021 ఎన్నికల్లో కూడా బిజెపి తరఫున ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. తిరిగి రెండోసారి పోటీపడుతున్న ప్రేమేందర్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

27న పోలింగ్, జూన్ 5న కౌంటింగ్..

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ పట్టబదుల స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ ఈనెల 27వ తేదీన జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.12 జిల్లాల పరిధిలో 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా జరిగే ఈ ఎన్నికలో 4.63 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జూన్‌ 5న ఓట్ల లెక్కింపు ఉంటుందని, కౌంటింగ్ ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..