Telangana Election 2024: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. తెలంగాణలో పెరిగిన ఓటింగ్ శాతం..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసుల సహకారం పూర్తిగా అందిందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.

Telangana Election 2024: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. తెలంగాణలో పెరిగిన ఓటింగ్ శాతం..
Ceo Vikas Raj
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Ravi Kiran

Updated on: May 14, 2024 | 11:37 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసుల సహకారం పూర్తిగా అందిందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. 2019తో పోల్చితే ఐదు నుంచి 10 శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉంటుంది అన్నట్లుగా అంచనా వేస్తున్నారు ఎన్నికల అధికారులు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ నమోదయింది. 17 పార్లమెంటు స్థానాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మొదటి ఒకటి రెండు గంటలు ఈవీఎంలు మొరాయించిన తరువాత పూర్తిస్థాయిలో సజావుగా పోలింగ్ జరిగింది. దీనికి తోడు రోజంతా వాతావరణం కూడా ఓటర్లకు సహకరించడంతో 2019 తో పోల్చితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ ఐదు నుంచి పది శాతం పెరిగే అవకాశం ఉంటుంది అన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా జరిగింది. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 5 పార్లమెంట్ స్థానాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలైన అదిలాబాద్ పార్లమెంట్ లోని సిర్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ పార్లమెంట్ పరిధిలో భూపాలపల్లి, మహబూబ్ బాద్ పార్లమెంట్ పరిధిలో ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కొత్తగూడెం, అశ్వారావుపేటలో సాయంత్రం నాలుగు గంటలకి ముగిసింది. ఒక నాలుగు ఐదు పోలింగ్ స్టేషన్స్ మినహాయిస్తే నాలుగు గంటలకు ముగిసిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో నాలుగు గంటలకే దాదాపుగా ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 106 స్థానాల్లో సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ జరిగినట్లు సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గంటలకు పోలింగ్ ముగిసిన 14వందల పోలింగ్ కేంద్రాల్లో ఇంకా క్యూ లైన్లలో ఓటర్లు ఉన్నారన్నారు సీఈఓ. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని వాతావరణం కూడా సహకరించిందని సీఈవో అన్నారు. లా అండ్ ఆర్డర్ లో కూడా ఎలాంటి ఇబ్బంది రాలేదని, రాత్రి 7 గంటల తరువాత ఓటింగ్ డేటా ఎంట్రీ స్టార్ట్ అవుతుందన్నారు. పోలింగ్ రోజు 400 వందల ఫిర్యాధు రాగా 38 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయినట్టు ప్రకటించారు. అదేవిధంగా 2వందలకు పైగా C విజిల్ ద్వారా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇక ఎన్నికల్లో రూ. 330 కోట్లు సీజ్ అయ్యాయని, అర్థరాత్రి వరకు పోలింగ్ శాతం గంట గంటకు మారుతుందన్నారు. మే14 మధ్యాహ్నం వరకు సరైన పోలింగ్ శాతం చెప్పడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

స్ట్రాంగ్ రూం లకుః ఈవీఎంల తరలింపులో వాహనాలకు GPS ఉంటుందని, పటిష్టమైన బందోబస్తు నడుమ ఈవీఎంలను అర్ధరాత్రి లోపు స్ట్రాంగ్ రూములకు తరలిస్తామన్నారు వికాస్ రాజ్. మే 14వ తేదిన పోలింగ్ పై స్క్రూటినీ ఉంటుందన్నారు. ఇక జరిగినటువంటి పోలింగ్‌పై అబ్జర్వర్ల నిర్ణయం తర్వాత రీపోలింగ్ ఉంటుందా లేదా అన్నది ప్రకటిస్తామన్నారు. అయితే, ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించేటువంటి పరిస్థితులు జరగలేదన్నారు సీఈవో. రాష్ట్ర వ్యాప్తంగా 44 కౌంటింగ్ కేంద్రాలు అదే కౌంటీ కేంద్రాల వద్ద 44 స్ట్రాంగ్ రూమ్ లు ఉన్నాయని వాటి దగ్గర కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి 24 గంటల పాటు సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందన్నారు అదేవిధంగా మూడంచెల బందోబస్తు సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి మాధవిలతపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిజామాబాద్, జహీరాబాద్ లలో కేసులు అయ్యాయని, మిగిలిన చోట్ల చెదురు మదురు ఘటనలు తప్పా, తీవ్రమైన ఘటనలు ఎక్కడ జరగలేదన్నారు. 2019 తో పోల్చితే 2024లో పోలింగ్ శాతం ఎక్కువగా జరిగిందని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సీఈవో వికాస్ రాజు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెట్టుబడిదారులకు రమేష్ దామనీ చిట్కాలు.. పాటిస్తే రాబడి వరదే..!
పెట్టుబడిదారులకు రమేష్ దామనీ చిట్కాలు.. పాటిస్తే రాబడి వరదే..!
తన సినిమా కలెక్షన్లను అనాథశ్రమానికి విరాళంగా ప్రకటించిన సోనూసూద్
తన సినిమా కలెక్షన్లను అనాథశ్రమానికి విరాళంగా ప్రకటించిన సోనూసూద్
బ్రిస్బేన్‌లో రోహిత్ శర్మ చేసిన 3 తప్పులు.. కట్‌చేస్తే..
బ్రిస్బేన్‌లో రోహిత్ శర్మ చేసిన 3 తప్పులు.. కట్‌చేస్తే..
బిడ్డకు విడుదల.. భార్యతో విడాకులు..కట్ చేస్తే..
బిడ్డకు విడుదల.. భార్యతో విడాకులు..కట్ చేస్తే..
పెట్రోలు ధరల టెన్షన్‌కు ఇక టాటా.. అందుబాటులోకి సీఎన్జీ కార్లు
పెట్రోలు ధరల టెన్షన్‌కు ఇక టాటా.. అందుబాటులోకి సీఎన్జీ కార్లు
'అల్లు అర్జున్‌కో రూలు.. వాళ్లకో రూలా?' సుమన్ సంచలన కామెంట్స్
'అల్లు అర్జున్‌కో రూలు.. వాళ్లకో రూలా?' సుమన్ సంచలన కామెంట్స్
గోల్డ్ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధర
గోల్డ్ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధర
బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ప్రైజ్ మనీతో పాటు పారితోషికం భారీగానే
బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ప్రైజ్ మనీతో పాటు పారితోషికం భారీగానే
ముగిసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌.. 445 పరుగులకు ఆలౌట్
ముగిసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌.. 445 పరుగులకు ఆలౌట్
Horoscope Today: ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
Horoscope Today: ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్