Vijayawada – HYD: ఓటేసి మళ్లీ సిటీ బాట పట్టిన జనం.. హైవేపై ఫుల్ ట్రాఫిక్
ఓట్ల పండుగ ముగిసింది..ఊళ్లకు వెళ్లిన జనం మళ్లీ నగరం బాటపట్టారు. దీంతో నిన్న అవుట్ గోయింగ్ రష్‌తో రద్దీగా కనిపించిన టోల్‌గేట్లు..ఈ రోజు ఇన్‌కమింగ్ రష్‌తో రద్దీగా మారాయి.
ఓటేయడానికి నగరం విడిచి ఊరుబాట పట్టిన జనం.. తిరుగు ప్రయాణమయ్యారు. పోలింగ్ ముగియడంతో మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు. దీంతో మూడురోజులుగా హైదరాబాద్ నుండి విజయవాడవెళ్లే రహదారి రద్దీగా మారగా..ఇప్పుడా పరిస్థితి మారింది. విజయవాడ వైపు నుండి వచ్చే వాహనాలతో జాతీయ రహదారి రద్దీగా మారింది. ఏపీనుండి హైదరాబాద్‌కు పెద్దసంఖ్యలో జనం రిటర్న్ అవడంతో..చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది.
ఇటు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు.. అటు ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేవిడతలో జరగడంతో..హైదరాబాద్ నగరం మొత్తం ఊరిబాటపట్టింది. మూడు రోజులపాటు వరస సెలవులు రావడంతో నగరవాసులంతా పల్లెబాటపట్టారు. దీంతో రెండు రోజులుగా హైదరాబాద్ సిటీలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. కేవలం సంక్రాంతి పండుగ టైమ్‌లోనే కనిపించిన దృశ్యాలు..ఓట్ల పండుగ నేపథ్యంలో మళ్లీ కనిపించాయి. ఇప్పుడు ఆ పండుగ ముగియడంతో జనం మళ్లీ సిటీబాట పట్టడంతో మళ్లీ రోడ్లపై సందడి కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..