AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Election 2024: ఏపీ ప్రజలు రాజకీయపరంగా చైతన్యవంతులు.. పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్

ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయపరంగా చైతన్యవంతులు. ఆ చైతన్యం క్రమక్రమంగా పెరుగుతూ రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గత పదిహేనేళ్లుగా ఓటింగ్ శాతం లెక్కల్లో బెటర్‌గా పెర్ఫామ్ చేస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. నేషనల్ రికార్డుల్ని సైతం బద్దలు కొడుతోంది. ఈసారి కూడా అదే ఊపు కంటిన్యూ ఐందా? ఏపీ ఓటరు మాత్రమే ఎందుకంత స్పెషల్..?

AP Election 2024: ఏపీ ప్రజలు రాజకీయపరంగా చైతన్యవంతులు.. పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్
Ap Election Polls
Balaraju Goud
|

Updated on: May 13, 2024 | 9:44 PM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయపరంగా చైతన్యవంతులు. ఆ చైతన్యం క్రమక్రమంగా పెరుగుతూ రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గత పదిహేనేళ్లుగా ఓటింగ్ శాతం లెక్కల్లో బెటర్‌గా పెర్ఫామ్ చేస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. నేషనల్ రికార్డుల్ని సైతం బద్దలు కొడుతోంది. ఈసారి కూడా అదే ఊపు కంటిన్యూ ఐందా? ఏపీ ఓటరు మాత్రమే ఎందుకంత స్పెషల్..?

2009లో 72.70 శాతం, 2014లో 74.64 శాతం, 2019లో 80.39 శాతం.. ఇలా ప్రతీ ఎన్నికల్లోనూ టోటల్ టర్నవుట్‌లో ఇంక్రిమెంట్ ఇస్తూ వస్తున్నాడు ఏపీ ఓటరు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 80.4 శాతం ఓట్లతో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే బాగా పెర్ఫామ్ చేసి రెండో స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్‌. టాప్‌ ప్లేస్‌లో ఉన్న వెస్ట్ బెంగాల్‌లో 81.8 శాతం ఓటింగ్‌ నమోదైంది. 2014లో నమోదైన 74.64 శాతం కంటే మరింత మెరుగుపడి 2019లో ఎయిటీ మార్క్‌ను క్రాస్ చేసింది ఏపీ.

ఇదిలా ఉంటే.. బాపట్ల, ఒంగోలు, నర్సరావుపేట.. ఏపీని దేశవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసిన మూడు పార్లమెంటు నియోజకవర్గాలు. ఎందుకంటే 2019 జనరల్ ఎలక్షన్స్‌లో అత్యధిక శాతం ఓటింగ్ జరిగిన టాప్‌-10 నియోజకవర్గాల్లో చోటు దక్కించుకున్నాయి ఈ మూడు సెగ్మెంట్లు. తమ రికార్డుల్ని తామే బద్దలు కొట్టి.. కింగ్‌ సైజులో నిలబడ్డ హాట్‌ ఫేవరిట్ నియోజకవర్గాలివి.

2014లో బాపట్ల ఎంపీ నియోజకవర్గంలో 85.16 శాతం ఓటింగ్ నమోదైతే.. 2019లో అది 85.49 శాతానికి పెరిగింది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో 2014లో 82.23 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటే.. 2019లో మరో మూడు శాతం అదనంగా.. 85.23 శాతం మంది పోలింగ్‌లో పార్టిసిపేట్ చేశారు. నర్సరావుపేట ఎంపీ సీట్లో 2014లో 84.68 శాతం నమోదైతే.. 2019లో అది 85.53 శాతానికి పెరిగింది.

అనకాపల్లి, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, హిందూపూర్, చిత్తూర్ లాంటి మరికొన్ని ఎంపీ సెగ్మెంట్లలో కూడా గతంలో 80 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాల్ని నిశితంగా గమనిస్తూ, వాటిపై లోతుగా చర్చిస్తూ.. ఎన్నికల ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొంటూ.. ఇలా పోలింగ్ పర్సెంటేజ్‌ని పెంచుతున్నారు ఏపీ జనం. జెనరేషన్లు మారుతున్నకొద్దీ రాజకీయాల పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఈ తేడా ప్రతీ ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సానుకూల సంకేతమని చెబుతున్నారు విశ్లేషకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..