Election 2024: సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతం.. రిమోట్ ఏరియాల్లో స్వేచ్చగా ఓటింగ్
ఓ పనైపోయింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో గడువు ప్రకారం సాయంత్రం 5 గంటల కల్లా పోలింగ్ పూర్తయింది. అటు ఏపీలో కూడా ఏజెన్సీలో పోలింగ్ సజావుగా జరిగింది.
ఓ పనైపోయింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో గడువు ప్రకారం సాయంత్రం 5 గంటల కల్లా పోలింగ్ పూర్తయింది. అటు ఏపీలో కూడా ఏజెన్సీలో పోలింగ్ సజావుగా జరిగింది.
తుపాకీ నీడలో ఓటు పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా రిమోట్ ఏరియాల్లో ఓటర్లు స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు అధికారులు. దాంతో గడవు ప్రకారం 5 గంటల కల్లా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్ 5 పార్లమెంట్ స్థానాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.– సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల.., మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటలో ఎలాంటి గొడవల్లేకుండా పోలింగ్ జరిగింది.
సాయంత్రం 4గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవాళ్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యమున్న చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లోని ఉంజుపల్లి, తిప్పాపురం, పెద్దమిడిసిలేరు, పైడిగూడెం గౌరారంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముందు జాగ్రత్త చర్యగా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత బలాగాలను భారీగా మోహరించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర నిఘాను ముమ్మరం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. తుపాకీ నీడలో పోలింగ్ సజావుగా సాగింది.
ఇక అటు ఏపీలోనే ఏజెన్సీ ఏరియాల్లో పోలింగ్ సజావుగా సాగింది.అరకు, పాడేరు, రంపచోడవరం,పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల కల్లా పోలింగ్ పూర్తయింది. అల్లూరి జిల్లా పాడేరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఓటింగ్ మందగించింది. చాలా చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మొత్తానికి గడువు ప్రకారం పోలింగ్ ముగిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…