Elections 2024: అర్థరాత్రి వరకు ఓటు వేసేందుకు క్యూలో ఉన్న ఓటర్లు.. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ శాతం..

నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా జరుగగా, ఏపీలో పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్‌ సమయం ముగిసే వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి సమయం గడిచినా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. అర్థరాత్రి 12 గంటల వరకు కూడా ఓట్లు వేశారు ఓటర్లు. అయితే ఈ సారి కాస్త ఓటింగ్‌ శాతం పెరిగింది. ఆదిలాబాద్ -73 శాతం, భువనగిరి 76.47 శాతం, చేవెళ్ల 55.45 శాతం

Elections 2024: అర్థరాత్రి వరకు ఓటు వేసేందుకు క్యూలో ఉన్న ఓటర్లు.. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ శాతం..
Elections
Follow us
Subhash Goud

|

Updated on: May 14, 2024 | 6:51 AM

నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా జరుగగా, ఏపీలో పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్‌ సమయం ముగిసే వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి సమయం గడిచినా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. అర్థరాత్రి 12 గంటల వరకు కూడా ఓట్లు వేశారు ఓటర్లు. అయితే ఈ సారి కాస్త ఓటింగ్‌ శాతం పెరిగింది. ఆదిలాబాద్ -73 శాతం, భువనగిరి 76.47 శాతం, చేవెళ్ల 55.45 శాతం అత్యల్పంగా హైదరాబాద్ 46.08 శాతం, కరీంనగర్ 72.33 శాతం, ఖమ్మం 75.19 శాతం, మహబూబాబాద్ 70.68 శాతం, మహబూబ్ నగర్ 71.54 శాతం, మల్కాజ్ గిరి 50.12 శాతం, మెదక్ 74.38 శాతం, నాగర్ కర్నూల్ 68.86 శాతం, నల్గొండ 73.78 శాతం, నిజామాబాద్ 71.50 శాతం, పెద్దపల్లి 67.88 శాతం, సికింద్రాబాద్ 48.11 శాతం, వరంగల్ 68.29 శాతం, జహీరాబాద్ 74.54 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో 50.34 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా 65 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఏపీలో రాత్రి 11 గంటల వరకు 78.36 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పోలింగ్‌ శాతం లెక్కలు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి