Telangana: పత్తి పంటలో గుప్పుమన్న అదో మాదిరి వాసన.. లోపలికెళ్లి చూడగా.. వామ్మో.!
గంజాయి సాగు చేస్తూ ముగ్గురు ప్రబుద్దులు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికారు. ఈ ఘటన కొమురం భీం జిల్లా లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీ పై లుక్కేయండి మరి. అదేంటంటే.?

తులసివనంలో గంజాయి మొక్క.. ఈ సామెతను నిజం చేశారు ముగ్గురు ప్రబుద్దులు. మనం ఎక్కడ నుంచో తెచ్చుకోవడం ఎందుకని.. ముగ్గురు వ్యక్తులు ఏకంగా.. తమ వనంలోనే గంజాయి మొక్కలను పెంచారు. ఇంకేముంది వాటిని అడ్డం పెట్టుకుని లక్షలు సంపాదించాలనుకున్నారు. కట్ చేస్తే.! పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికి.. ఊసలు లేక్కపెడుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ అర్బన్ మండలం బాబ్జీపేట గ్రామంలోని పత్తి పంటల్లో గంజాయి మొక్కలు సాగు చేశారు ముగ్గురు వ్యక్తులు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేయగా.. అక్కడున్న 32 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని.. సదరు నిందుతులలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీ ఉన్నాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది చదవండి: ఎవడు మమ్మీ వీడు.! 42 ఫోర్లతో 437 పరుగులు.. దెబ్బకు బౌలర్లను పేకాటాడేశాడుగా




