Telangana Congress: కాంగ్రెస్లో ఎమ్మెల్సీ కోసం తీవ్ర పోటీ.. లైన్లో ఎవరెవరున్నారంటే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల పై రోజురోజుకు పోటీ పెరుగుతోంది. ప్రస్తుతం గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు.. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నలుగురు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. దీని కోసం తమ పదవులకు రాజీనామా చేయడంతో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు ఖాళీ అయిన స్థానాలపై నేతలు గంపేడు ఆశలు పెట్టుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల పై రోజురోజుకు పోటీ పెరుగుతోంది. ప్రస్తుతం గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు.. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నలుగురు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. దీని కోసం తమ పదవులకు రాజీనామా చేయడంతో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు ఖాళీ అయిన స్థానాలపై నేతలు గంపేడు ఆశలు పెట్టుకున్నారు. మొత్తం ఆరు ఎమ్మెల్సీలకి 20 మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అధిష్టానం వద్ద పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. ఇందులో టికెట్ త్యాగాలు చేసిన వారితో పాటూ పొత్తులో ఉన్న పార్టీ నేతలు ఉన్నారు. వీరితో పాటూ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు.
టికెట్ త్యాగాలు చేసిన రేసులో వనపర్తి టికెట్ ఆశించి అభ్యర్థిగా ప్రకటించప్పటికీ చివరి నిమిషంలో బిఫార్మ్ రాని చిన్నారెడ్డి, తుంగతుర్తి టికెట్ ఆశించి చివరి నిముషంలో భంగపడ్డ అద్దంకి దయాకర్, పార్టీలో గత కొద్ది సంవత్సరాలుగా క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ పోటీ పడుతున్నారు. టికెట్ రాక ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చిన వారిలో భూపతి రెడ్డి నర్సారెడ్డి , హరివర్ధన్ రెడ్డి, అలీ మస్కతి సైతం పోటీలో ఉన్నారు. ఇక ఎన్నికల్లో మద్దతు ఇచ్చి పొత్తులో కలిసి పనిచేసిన తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ టికెట్ బరిలో ఉన్నారు. వీరిలో కోదండరాంకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంది. పొత్తులో ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ మేరకు చాడ రేసులో ఉన్నారు.
ఇక పోటీ చేసి ఓడిపోయిన నేతలు సైతం ఎమ్మెల్సీ కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారిలో కీలకంగా సీనియర్ నేత షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, మధుయాష్కి గౌడ్, సంపత్ కుమార్లు పోటీ పడుతున్నారు. వీరు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నారు. ఖాళీగా ఉన్న అరు ఎమ్మెల్సీ ల్లో ఎవరికి అవకాశం ఇస్తారు. ఎంతమందికి అదృష్టం వరించబోతుంది.. అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..