Telangana: సీరియల్ సైకో కిల్లర్.. కూరగాయలు తరిగినంత ఈజీగా హత్యలు.. ఆధారాలు లేకుండా మృత్యుతీర్థం
సత్యనారాయణకు.. తాతల నుంచి నేర్చుకున్న నాటు వైద్యం వృత్తి అయితే.. ప్రవృత్తి గుప్త నిధుల పేరుతో అమాయకులను బలి తీసుకోవడం. గుప్త నిధులు ఉన్నాయని పూజలు చేస్తే అపార సంపద మీ సొంతం అవుతుందని మొదట నమ్మిస్తాడు. ఆ తర్వాత పూజలు చేసినందుకు తనకు భారీగా డబ్బు లేదా భూములు ఇవ్వాలని కోరతాడు. సంపదకు ఆశపడ్డ బాధితులు కోరినట్లుగా సత్యం యాదవ్ కు ముట్ట చెప్పేవారు. అలా ఇప్పటి వరకు ఒకరి దగ్గర 9లక్షలు, ఇంకొంత మంది దగ్గర ప్లాట్, ల్యాండ్ తీసుకున్నాడు.
తాంత్రిక పూజల సీరియల్ కిల్లర్ సత్యనారాయణ యాదవ్ ను నాగర్ కర్నూల్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మొత్తం 11మందిని హత్య చేసిన ఈ సీరియల్ కిల్లర్.. ఇప్పటివరకు 8కేసుల్లో నిందితుడిగా గుర్తించారు. నిందితుడి వద్ద నుండి విష ద్రవ్యాలతో కూడిన బాటిల్స్, బాధితుల ఫోన్లు, 10 సిమ్ కార్డ్ లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. 2020 సంవత్సరం నుంచి వరుస హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నలుగురు, వనపర్తి జిల్లాలో నలుగురు, కర్ణాటక బలగనూర్ లో ఒకరు, ఏపి లోని అనంతపురంలో ఒకరిని ఈ నరహంతకుడు సత్యనారాయణ హత్య చేశాడు.
వెలుగులోకి మొత్తం 10 హత్యలు:
హైదరాబాద్ లో ఓ మిస్సింగ్ కేసులో దర్యాప్తు కాస్త ఈ సీరియల్ మర్డర్ మిస్టరీ బయటపడింది. లంగర్ హౌస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నట్టుండి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ కు చెందిన సత్యనారాయణపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు సత్యనారాయణ పొంతన లేని సమాధానాలు, వివాదాస్పద వైఖరిని ప్రదర్శించాడు. అనుమానంతో పోలీసులు కేసును లోతుగా దర్యాఫ్తు చేపట్టారు. తీరా అసలు సీరియల్ సైకో కిల్లర్ చిట్టా బహిర్గతం అయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సత్యనారాయణ తాంత్రిక పూజల బండారం బట్టబయలైంది.
గుప్త నిధుల పేరుతో అమాయకులకు ఎర:
సత్యనారాయణకు.. తాతల నుంచి నేర్చుకున్న నాటు వైద్యం వృత్తి అయితే.. ప్రవృత్తి గుప్త నిధుల పేరుతో అమాయకులను బలి తీసుకోవడం. గుప్త నిధులు ఉన్నాయని పూజలు చేస్తే అపార సంపద మీ సొంతం అవుతుందని మొదట నమ్మిస్తాడు. ఆ తర్వాత పూజలు చేసినందుకు తనకు భారీగా డబ్బు లేదా భూములు ఇవ్వాలని కోరతాడు. సంపదకు ఆశపడ్డ బాధితులు కోరినట్లుగా సత్యం యాదవ్ కు ముట్ట చెప్పేవారు. అలా ఇప్పటి వరకు ఒకరి దగ్గర 9లక్షలు, ఇంకొంత మంది దగ్గర ప్లాట్, ల్యాండ్ తీసుకున్నాడు. ఒక కుటుంబం వద్ద అయితే ఏకంగా మూడున్నర ఎకరాల ల్యాండ్ పొందాడు.
మృత్యుతీర్థం: జిల్లేడు పాలు, నల్ల ఆయిల్ ఆకు, మూలికలు
డబ్బు, ల్యాండ్ ఇచ్చిన వాళ్ళలో ఎవరైతే తీవ్ర ఒత్తిడి తెస్తారో వాళ్లను అదే తాంత్రిక పూజల పేరుతో హత్య చేస్తాడు. తీర్థం రూపంలో జిల్లేడు పాలు, నల్ల ఆయిల్ ఆకు, మూలికల పానీయం ఇచ్చి మిస్టరీగా హతమార్చుతాడు. ఎక్కడా కూడా కూడా ఒక్క ఆధారం సైతం వదలడు ఈ మాయలమారీ.
కూరగాయలు తరిగినంత ఈజీగా హత్యలు
అరెస్ట్ చేసిన తర్వాత సత్యనారాయణ ను గద్వాల్ రేంజ్ డిఐజి ఎల్.ఎస్. చౌహాన్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీరియల్ సైకో కిల్లర్ కేసులో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పారు. నిందితుడు ఎక్స్ స్ట్రీమ్ సైకో మెంటాలిటీ కలిగి ఉన్నాడని చెప్పారు. కూరగాయలు తరిమినట్టుగా హత్యలు చేసే వ్యవహారశైలి కనిపిస్తోందని చెప్పారు. కస్టడలోకి తీసుకొని లోతుగా దర్యాఫ్తు చేస్తే మరిన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..