AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Great Wall of China: వందల ఏళ్లుగా చెక్కు చెదరని చైనా గోడ.. ఇన్ని శతాబ్దాల పాటు ఎలా నిలబడింది? శాస్త్రవేత్తలనే షాక్‌కు గురి చేసిన నిజాలు

చైనా, అమెరికా, స్పెయిన్‌ల పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక సహకార అధ్యయనం చారిత్రక కట్టడాలపై బయోక్రస్ట్ ప్రభావాలకు సంబంధించి కొత్త చర్చకు దారితీసింది. నిజానికి లైకెన్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, నాచులు, చిన్న మొక్కలతో కూడిన బయోక్రస్ట్‌లు ఖనిజ ఉపరితలాలపై పెరుగుతాయి. అయితే చారిత్రాత్మక ప్రదేశాల నిర్మాణ సమగ్రతకు ముప్పుగా పరిగణిస్తారు. ఈ జీవులు స్మారక చిహ్నాలకు ముప్పు కలిగిస్తాయా ..! లేదా రక్షిత కవచంగా పనిచేస్తాయా..!

Great Wall of China: వందల ఏళ్లుగా చెక్కు చెదరని చైనా గోడ.. ఇన్ని శతాబ్దాల పాటు ఎలా నిలబడింది? శాస్త్రవేత్తలనే షాక్‌కు గురి చేసిన నిజాలు
Great Wall Of China
Follow us
Surya Kala

|

Updated on: Dec 12, 2023 | 8:42 PM

ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా.. అత్యంత పొడవైన ఈ గోడ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు.. దీనిని ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ అని కూడా పిలుస్తారు. ఈ గోడ మొత్తం పొడవు 8,850 కిలోమీటర్లు. ఈ గ్రేట్ వాల్ నిర్మాణ పనులు క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో ప్రారంభమై 16వ శతాబ్దంలో ముగిశాయని చెబుతారు. అంటే ఈ గోడ ఎంత పాతదో అర్ధం చేసుకోవచ్చు.. ఈ గోడ శతాబ్దాలుగా ఠీవిగా నిలబడి ఉంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ గోడ వేల సంవత్సరాలుగా ఇలా నిలబడటానికి కారణాన్ని కనుగొన్నారు.

సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం చైనా, అమెరికా, స్పెయిన్‌ల పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక సహకార అధ్యయనం చారిత్రక కట్టడాలపై బయోక్రస్ట్ ప్రభావాలకు సంబంధించి కొత్త చర్చకు దారితీసింది. నిజానికి లైకెన్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, నాచులు, చిన్న మొక్కలతో కూడిన బయోక్రస్ట్‌లు ఖనిజ ఉపరితలాలపై పెరుగుతాయి. అయితే చారిత్రాత్మక ప్రదేశాల నిర్మాణ సమగ్రతకు ముప్పుగా పరిగణిస్తారు. ఈ జీవులు స్మారక చిహ్నాలకు ముప్పు కలిగిస్తాయా ..! లేదా రక్షిత కవచంగా పనిచేస్తాయా..! చారిత్రక నిర్మాణాల జీవితకాలాన్ని పెంచుతాయా అనే చర్చ ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంది.

600 కి.మీ. పొడవైన గోడను పరిశీలించిన పరిశోధకులు

నివేదికల ప్రకారం పరిశోధకుల బృందం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సుమారు 600 కిలోమీటర్ల మేర సమగ్ర సర్వేను నిర్వహించింది. బయోక్రస్ట్‌లు పురావస్తు ప్రదేశాలను ప్రభావితం చేసే నిర్దిష్ట పరిస్థితులను అర్థం చేసుకోవడానికి పొడి వాతావరణం ఉన్న విభాగాలపై దృష్టి సారించింది.

ఇవి కూడా చదవండి

అధ్యయనం ఏమి కనుగొన్నది అంటే..!

మట్టి నుండి ఇసుక, గులకరాళ్ళ పొరల వరకు నిర్మాణ సామగ్రిని అధ్యయనం చేసిన అధ్యయనంలో శుష్క ప్రాంతాలతో సహా వివిధ పర్యావరణ సవాళ్లకు గ్రేట్ వాల్ అనుకూలతను వెల్లడిస్తుంది. అయితే గోడలోని చాలా పాత విభాగాల్లో నేల మీద బయోక్రస్ట్ లు కనిపించాయని వెల్లడించారు. ఈ సూక్ష్మజీవులు పురాతన నిర్మాణాల సంరక్షణ లేదా క్షీణతకు దోహదం చేస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..