AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: గ్రేటర్‌ హైదరాబాద్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష.. హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు..

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం... పరిపాలనపై దృష్టి పెట్టింది. ఓవరాల్‌గా అన్ని ఇష్యూస్‌ మీద సీఎం రేవంత్‌ రివ్యూలు చేస్తుంటే... తమతమ శాఖలపై మంత్రులు సమీక్షలు మొదలెట్టారు. ఆయా శాఖల్లో పరిస్థితులపై అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

Revanth Reddy: గ్రేటర్‌ హైదరాబాద్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష.. హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు..
Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Dec 12, 2023 | 9:54 PM

Share

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. పరిపాలనపై దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌ అండ్‌ టీమ్‌.. పని మొదలుపెట్టి.. వరుసగా సమీక్షలు చేస్తోంది. తమతమ పరిధిలోని శాఖలపై పట్టు సాధించేందుకు.. సీఎం తోపాటు మంత్రులు వరుసబెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్‌ శాఖపై వరుసగా రెండ్రోజుల పాటు సమీక్ష చేసిన సీఎం రేవంత్‌.. ఇవాళ గ్రేటర్‌ హైదరాబాద్‌పై రివ్యూ చేశారు. మూసీ ప్రక్షాళన, నది పరిసరాల్లో అక్రమనిర్మాణాలు.. తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలూ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించి.. రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.

టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై ఫోకస్‌ పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి .. ఆ అంశంపై ఉదయం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. పోటీ పరీక్షల తేదీలను రీషెడ్యూల్‌ చేయాలని యోచిస్తున్న సీఎం.. ఈనెల 17న తెలంగాణ జెన్‌కో పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు. జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా మార్పులు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే గ్రూప్‌-2 పరీక్ష రీషెడ్యూల్‌ చేసే అవకాశం ఉంది. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీకి అనుగుణంగా.. జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

సివిల్‌ సప్లయ్‌ శాఖపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

మరోవైపు, సివిల్‌ సప్లైస్ శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. కొత్త రేషన్‌కార్డుల జారీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సివిల్ సప్లైస్ శాఖను గత పాలకులు అస్తవ్యస్తం చేశారన్న ఉత్తమ్‌.. చాలా రుణాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 12% మంది వినియోగదారులు రేషన్‌కార్డులు ఉపయోగించడం లేదన్న మంత్రి… అర్హులైన వారికి కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు కసరత్తు చేస్తున్నామన్నారు.

వ్యవసాయశాఖపై మంత్రి తుమ్మల రివ్యూ

వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రివ్యూ చేశారు. మంచి దిగుబడి వచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మార్కెట్‌ యార్డుల స్థితిగతులపై పూర్తివివరాలను అందించాలని ఆదేశించారు. మొత్తానికి, వరుస సమీక్షలతో అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు.. పాలనను ట్రాక్‌ ఎక్కించే పనిలో పడ్డారన్నమాట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
అప్పుడు వద్దన్నాడు.. తర్వాత హీరోగా సినిమా తీశాడు..
అప్పుడు వద్దన్నాడు.. తర్వాత హీరోగా సినిమా తీశాడు..
వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త
వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త